Site icon NTV Telugu

CM Chandrababu: “మీ కోరిక తీరింది.. నా కల నెరవేర్చండి”.. కొత్త టీచర్లకు సీఎం కీలక సూచన..

Cm Chandrababu3

Cm Chandrababu3

CM Chandrababu: రాజకీయాల్లోకి రావడానికి ఎకనామిక్స్‌ ప్రొఫెసర్‌ డీఎల్‌ నారాయణ తనను ప్రోత్సహించారు. యూనివర్శిటీ క్యాంపస్‌ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండేళ్లకే మంత్రి అయ్యానని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మెగా డీఎస్సీ విజేతల సభలో సీఎం ప్రసంగించారు. మనల్ని ప్రోత్సహించే వారుంటే ఆకాశమ హద్దుగా ఉంటుందన్నారు. పిల్లల్లో నైపుణ్యాలను ఉపాధ్యాయులే గుర్తించాలని.. ప్రపంచ మార్పుల మేరకు ఏపీ యువత విద్య అభ్యసించాలని సూచించారు. పిల్లల మనోభావాల మేరకు చెబితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అనంతరం.. డీఎస్సీ ద్వారా కొత్తగా రిక్రూట్ అయిన టీచర్లతో ముఖాముఖి నిర్వహించారు. మెగా డీఎస్సీపైనే తొలి సంతకం ఎందుకు పెట్టారని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి అడిగారు.

READ MORE: Anganwadi Centers: అంగన్వాడి కేంద్రాలకు మొట్ట మొదటిసారి దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే?

ఈ ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పారు. “గత ఐదేళ్ల కాలంలో ఒక్క టీచరును కూడా నియమించలేదు. తొలిసారిగా సీఎం అయినప్పటి నుంచి విద్య పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాను. ఐటీ చదవమని ఆ రోజుల్లో చాలా మందికి చెప్పాను… కొందరు నా మాటపై నమ్మకంతో పట్టణాలకు వచ్చి చదువుకున్నారు. ఆ రోజు చక్కగా చదువుకున్నవారు… ఇప్పుడు విదేశాలకు వెళ్లారు…బాగా స్థిరపడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రులందరు ఎంతమంది టీచర్లను నియమించారో… నేను ఒక్కడినే అంత మంది టీచర్లను నియమించాను. విద్యా రంగాన్ని నేను ఎప్పుడూ అశ్రద్ధగా చూడలేదు.. నిర్లక్ష్యం చేయలేదు. మొదటి సూపర్ సిక్స్‌ యువతకు 20 లక్షల ఉద్యోగాలు… దాంట్లో భాగంగా మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశాను. మెగా డీఎస్సీని సూపర్ హిట్ చేశారు. మెగా డీఎస్సీని సమర్థవంతంగా నిర్వహించిన మంత్రి నారా లోకేష్, టీంను అభినందిస్తున్నాను. ఉద్యోగం సంపాదించాలన్న మీ కోరిక తీరింది.. పేదరికం లేని సమాజం చూడాలనేది నా కోరిక. పేదరికం లేని సమాజాన్ని చూడాలంటే… విద్యతోనే సాధ్యం.. దాన్ని మీరే నెరవేర్చాలి. మగవాళ్లకంటే.. మహిళలే ఎక్కువగా చదువు చెప్పగలరు. లోకేష్ చదువు బాధ్యత కూడా నా సతీమణి భువనేశ్వరి తీసుకుంది. టీచర్లుగా బాధ్యతలు తీసుకున్న మీరంతా బాగా పని చేయాలి… మంచి పేరు తీసుకురావాలి. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేలా టీచర్లంతా పని చేయాలి.” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

READ MORE: Telangana : తెలంగాణలో దసరా షాపింగ్ బీభత్స ప్రారంభం.. హైదరాబాద్ మార్కెట్లలో ఉత్సాహం

నాయకత్వ ప్రయాణంలో సీఎం చంద్రబాబుకు స్పూర్తినిచ్చిన ఉపాధ్యాయుడి గురించి చెప్పాలంటూ ముఖ్యమంత్రిని ప్రకాశం జిల్లాకు చెందిన జంధ్యాల అంజనీ అడిగింది. “డీఎల్ నారాయణ అనే ఎకనామిక్స్ ప్రొఫెసర్ నన్ను ప్రోత్సహించేవారు. రాజకీయాల్లోకి వెళ్తానంటే డీఎల్ నారాయణ నన్ను ప్రొత్సహించారు. యూనివర్శిటీ క్యాంపస్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను. విద్యార్థులకు ప్రొత్సహం అందిస్తే… ఎంతటి కష్టమైన కార్యాన్నైనా సాధిస్తారు. ఇప్పుడు పరిస్థితి మారింది… హార్డ్ వర్క్ కాదు… స్మార్ట్ వర్క్ చేసే రోజులివి. ఏపీని నెంబర్-1 చేయాలి.. ఆ శక్తి టీచర్లల్లోనే ఉంది.” అని సీఎం వివరణ ఇచ్చారు.

 

Exit mobile version