CM Chandrababu: నూతన సంవత్సర కానుకగా రాజముద్రతో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో నాటి సీఎం ఫోటోలతో భూమి హక్కు పత్రాల పంపిణీ చేశారని గుర్తు చేశారు. నాటి ప్రభుత్వ చర్యలపై ప్రజల అసంతృప్తి నేపథ్యంలో రీ సర్వే చేసి తప్పులను సరిదిద్ది కొత్త పాసుపుస్తకాలు ఇస్తామని కూటమి హామీ ఇచ్చిందని తెలిపారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపణీపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రీ సర్వే పూర్తైన గ్రామాల పరిధిలో 22 లక్షల కొత్త పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభమైందని తెలిపారు. జనవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేపడతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కొనసాగుతుందన్నారు. వేలాది గ్రామాల్లో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ సంబరంగా మొదలైంది.. జగన్ బొమ్మతో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో రాజముద్ర ఉన్న పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నామన్నారు.
READ MORE: Naa Anveshana : ముగిసిన స్నేహం.. మొదలైన యుద్ధం.! అన్వేష్ కాంట్రవర్సీలో ‘ఏయ్ జూడ్’ సంచలన వీడియో
గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. “వివాదాలు లేని స్థలాలను కూడా రీ సర్వే పేరుతో అడ్డదిడ్డంగా చేసి వివాదాస్పదం చేశారు. భూమే ప్రాణంగా బతికే రైతులకు భూ సమస్యలు లేకుండా చేయడం మన లక్ష్యం. గత ప్రభుత్వం అసంబద్దంగా తెచ్చిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజలకు అభద్రతను దూరం చేశాం. నేడు పాసుపుస్తకాల పంపిణీ ప్రతి ఇంట్లో కొత్త సంతోషాన్ని తెస్తోంది. పాసుపుస్తకాలపై తమ బొమ్మలకు నాటి పాలకులు రూ.22 కోట్లు తగలేశారు. ప్రజలకు భూ వివాదాలు లేకుండా చేయడం అనేది ప్రథమ కర్తవ్యం కావాలి… నిర్దిష్ట సమయాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలి. మంత్రులు, జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో ఎక్కువ చొరవ తీసుకోవాలి.”అని దిశానిర్దేశం చేశారు.
READ MORE: Pickle 1 AR Glasses : మీ జీవితాన్నే గుర్తుంచుకునే ‘పికిల్ 1’ AR గ్లాసెస్.. !
