CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో మంత్రులకు అభినందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మొంథా తుఫాన్ సమయంలో క్షేత్ర స్థాయిలో బాగా పనిచేశారని మంత్రులను ప్రత్యేకంగా అభినందించారు.. ప్రతి ఒక్కరూ క్షేత్ర స్థాయిలో ఉండి.. ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారని పేర్కొన్నారు.. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయడం వల్లనే తుఫాన్ సహాయక చర్యలు వేగంగా అందాయని తెలిపారు.. ఇక, ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ, టెక్నాలజీ సహాయంతో ప్రాణ, ఆస్థి నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగామని వెల్లడించారు.. మంత్రులు, అధికారులు, యంత్రాంగం టీం స్పిరిట్ తో పనిచేస్తే.. ఇటువంటి మంచి ఫలితాలే వస్తాయని అభినందనలు తెలిపారు.. మీరంతా ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా చూశానంటూ మంత్రులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, మొంథా తుఫాన్ రాష్ట్రంపై విరుచుకుపడినా.. ప్రభుత్వ ముందస్తు చర్యలతో భారీ ఆస్తి నష్టం కలగకుండా.. ప్రాణ నష్టం లేకుండా చూసిన విషయం విదితమే..
Read Also: Car Sales: తగ్గిన క్రెటా, బ్రెజా హవా.. జనాలు ఈ ఎస్‌యూవీ కోసం ఎగబడుతున్నారు!
