Site icon NTV Telugu

CM Chandrababu: ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం తేదీలో మార్పు.. ఖాతాల్లో రూ.15 వేలు జమ చేసేది అప్పుడే..?

Cm Chandrababu Assembly

Cm Chandrababu Assembly

CM Chandrababu: అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు మరోసారి ఆటో డ్రైవర్ల ఆర్థిక సాయంపై స్పందించారు. వచ్చే నెల 4న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.. ఆటో డ్రైవర్లు పెండింగ్ చలాన్‌లు ఉంటే క్లియర్ చేస్కోవాలని సూచించారు. అక్టోబర్ 4న సాయంత్రం 4 గంటలకు వాహనమిత్ర ద్వారా 15 వేలు ఆటో డ్రైవర్లకు అందజేస్తామన్నారు. అయితే.. దరసరా రోజు (అక్టోబర్ 2)న ఆటోడ్రైవర్ల ఖాతాలో రూ.15 వేల చొప్పున జమ చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించారు. తాజాగా తేదీని నాలుగుకు మార్చారు. మరోవైపు.. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశారు. సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఈ ఆర్థిక సాయం వర్తించనున్నారు.

READ MORE: Amazon Sale 2025: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్స్, 64MP కెమెరాలు ఉన్న ఫోన్‌లపై వేలల్లో డిస్కౌంట్.. త్వరపడండి

“అక్టోబర్ 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. చాలా ఆలోచించి పేదల సేవలో అనే పేరు పెట్టాం. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాయి. అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తామని చెప్పాం. నాడు చెప్పాం.. నేడు చేసి చూపుతున్నాం. ఆటో డ్రైవర్ల సేవలో పేరుతో ప్రతి ఏడాది రూ.15 వేలు ఇస్తాం. అక్టోబరు 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. 2,90,234 మంది డ్రైవర్లు ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో లబ్దిదారులుగా ఉన్నారు.
ఏదైనా కారణాల వల్లనైనా ఎవరైనా లబ్దిదారుల జాబితాలో పేరు లేకపోతే… వారి సమస్యలను పరిష్కరించి వారినీ లబ్దిదారుల జాబితాలో చేరుస్తాం. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల స్కీంను వర్తింప చేస్తున్నాం. ఈ పథకానికి రూ.435 కోట్ల ఖర్చు చేస్తున్నాం. గత ప్రభుత్వం రూ.12 వేలు మాత్రమే ఇచ్చేది.. మేం రూ. 15 వేలు ఇస్తున్నాం.” అని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.

READ MORE: Yogi Adityanath: ‘‘నన్ను మరిచావా మౌలానా’’.. ‘‘ఐ లవ్ ముహమ్మద్‌’’పై యోగి వార్నింగ్..

మార్గదర్శకాలు ఇవే..
లబ్ధిదారులు సొంత వాహనం, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి. లబ్ధిదారులు తమ వాహనానికి ఏపీ రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్, టాక్స్ చెల్లింపు ధ్రువపత్రాలు కలిగి ఉండాలి. మూడు, నాలుగు చక్రాల సరకు రవాణా వాహనాలకు పథకం వర్తించదు. లబ్ధిదారుడు తప్పని సరిగా ఆధార్, రేషన్ కార్డు కలిగి ఉండాలి. కుటుంబంలో ఒకవాహనదారుడికి మాత్రమే పథకం వర్తింపు. లబ్ధిదారుల ఎంపిక , పథకం అమలు కోసం చర్యలు చేపట్టనున్న గ్రామ వార్డు సచివాలయాలు, రవాణాశాఖ. ఈనెల 17 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ. ఈ నెల 24 నాటికి దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం చేయనున్న ప్రభుత్వం. అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేయనున్న ప్రభుత్వం

READ MORE: Yogi Adityanath: ‘‘నన్ను మరిచావా మౌలానా’’.. ‘‘ఐ లవ్ ముహమ్మద్‌’’పై యోగి వార్నింగ్..

Exit mobile version