Site icon NTV Telugu

Kuppam: భూమి మీద నూకలు ఉండటమంటే ఇదేనేమో.. త్రుటిలో తప్పించుకున్న మహిళలు..

Kuppam

Kuppam

Kuppam Accident: మనకు బ్రతికే అదృష్టం ఉంటే.. ఎంతటి ప్రమాదం వచ్చినా ఏమి కాదు. చిన్న గాయం కూడా కాకుండా బ్రతికి బయటపడతాం. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఎన్నో సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. కొన్ని ప్రమాదాలు ఒళ్లు గగుర్పాటుకు గురి చేసేలా ఉంటాయి. ఏదో యముడు సెలవుకు వెళ్లినట్లుగా కొంతమంది ఆ ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకుంటారు. అలాంటి ఘటనే తాజాగా కుప్పంలో చోటు చేసుకుంది. కుప్పం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

READ MORE: Akash Deep Fifty: ఆకాశ్‌ దీప్ సూపరో సూపర్.. హాఫ్ సెంచరీ వీడియో వైరల్!

తమిళనాడు నుంచి వచ్చిన లారీ బైకుపై దూసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న పాల లారీని ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న చప్పిడిగరుగులుకు చెందిన గౌతం(22) అక్కడికక్కడే మృతిచెందగా మరో యువకుడు అహ్మద్ (20) తీవ్రంగా గాయపడ్డాడు. లారీ చక్రాల కింద ఇరుక్కున్న మృతదేహాన్ని పోలీసులు బయటకు లాగారు. ఫ్లై ఓవర్ పై వస్తున్న ద్విచక్ర వాహనం సడన్గా కుప్పం వైపు మళ్లించడంతో ఎదురుగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని మరో లారీని ఢీకొంది. పాల వ్యాన్ వెనుక ఉన్న ఇద్దరు మహిళలు రెప్పపాటులో తప్పించుకున్నారు.

READ MORE: Vizag Food Safety Raids: కలుషిత ఆహార నగరంగా విశాఖ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..

Exit mobile version