Site icon NTV Telugu

Kanpur: కాన్పూర్‌లో విషాదం.. ప్రీ-బోర్డ్ పరీక్షకు ముందు జిల్లా టాపర్ ఆత్మహత్య

Sucide

Sucide

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. చదువులో టాప్‌లో ఉన్న ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. కుమారుడు విగతజీవిగా ఉండడం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Rajnath Singh-IAS Trainees: ఐఏఎస్ శిక్షణా కేంద్రంలో రాజ్‌నాథ్‌సింగ్‌కు వింత అనుభవం.. ఏం జరిగిందంటే..!

రౌనక్ పాఠక్ (17) అనే విద్యార్థి 2023లో 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 97.4 శాతం మార్కులతో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో అతనికి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పూర్తి ఫీజు మినహాయింపు లభించింది. ప్రస్తుతం బ్రిజ్ కిషోరి దేవి మెమోరియల్ ఇంటర్ కాలేజీలో విద్యను అభ్యషిస్తున్నాడు.

ఇది కూడా చదవండి: Imran Khan: పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు భారీ ఆందోళనలకు పిలుపు.. 144 సెక్షన్ విధింపు

ఇక ప్రస్తుతం ప్రీ-బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ సోమవారం ఉదయం కాలేజీకి అని వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తండ్రి అలోక్ పాఠక్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో బైక్‌పై కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదని చెప్పాడు. పదే పదే ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో సోదరి మినీ, తండ్రి వెతకడం ప్రారంభించారు. కొన్ని గంటల తర్వాత జూహి రైల్వే యార్డ్ సమీపంలో శవమై కనిపించాడు. పట్టాల పక్కన రౌనక్ విగజీవిగా పడి ఉన్నాడు. దీంతో అక్కడే తండ్రి కుప్పకూలిపోయాడు. తన కొడుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదని.. చాలా తెలివైన వాడని కన్నీరుమున్నీరుగా విలపించాడు.

పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. మొబైల్ ఫోన్ డేటాను పరిశీలిస్తున్నామని.. అలాగే స్నేహితులను కూడా విచారిస్తున్నట్లు వెల్లడించారు. ఇక రౌనక్ మరణవార్తతో కాలేజీలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.

Exit mobile version