NTV Telugu Site icon

Macharla Clashes: రణరంగంగా మారిన మాచర్ల.. వైసీపీ, టీడీపీ వర్గీయుల దాడులు, ప్రతిదాడులు

Macharla Clashes

Macharla Clashes

Macharla Clashes: పల్నాడు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాచర్ల రణరంగంగా మారింది. మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పెద్దసంఖ్యలో వైసీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని టీడీపీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. కర్రలతో టీడీపీ వారిపై దాడి చేశారు. టీడీపీ శ్రేణులు వారిపై తిరగబడడంతో ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ గొడవలో కొందరికి గాయాలు అయినట్లు సమాచారం. వారిని ఆసుపత్రికి తరలించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

. వైసీపీ నేత, మాజీ మున్సిపల్ ఛైర్మన్ కిశోర్ ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డులోనే ‘ఇదేం ఖర్మరా బాబు’ కార్యక్రమం నిర్వహించాలని టీడీపీ చూసింది. దీంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు యత్నించాయి. ఈ క్రమంలోనే ఇరు వర్గాలు దాడికి దిగడంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇదే సమయంలో టీడీపీ నేత బ్రహ్మానందరెడ్డిని పోలీసులు గుంటూరు తరలిస్తుండగా ఆ వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు వెంబడించారు. ఈ విషయం తెలుసుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు మాచర్లకు చేరుకున్నారు. టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంతో పట్టణంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మాచర్లలో కొందరు దుండగులు వాహనాలను తగలబెట్టారు. సొసైటీ కాలనీలోని టీడీపీ ఇన్‌ఛార్జి బ్రహ్మానందరెడ్డి గృహాన్ని తగలబెట్టినట్లు సమాచారం. పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు వైకాపా కార్యకర్తలకు గాయాలు కావడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ గొడవల నేపథ్యంలో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Clashes in Macharla: మాచర్లలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ

భారీగా ఆ ప్రాంతానికి ఇరుపార్టీల శ్రేణులు దాడులకు దిగారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని నిలిపివేశారు. తెదేపా ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను బలవంతంగా వాహనంలో ఎక్కించి గుంటూరు తరలిస్తున్నారు. మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడు.. కొమర దుర్గారావు కారును తగలబెట్టారు.

 

Show comments