NTV Telugu Site icon

BJP v/s MRPS: మహబూబ్ నగర్‎లో ఉద్రిక్తత.. బీజేపీ ఎమ్మార్పీఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

New Project (27)

New Project (27)

BJP v/s MRPS: మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మార్పీఎస్‌, బీజేపీ కార్యకర్తల నడుమ ఘర్షణ జరిగింది. ఎస్సీ వర్గకరణ సమస్య పరిష్కారం డిమాండ్‌తో ర్యాలీ చేపట్టిన ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు.. అన్నపూర్ణ గార్డెన్‌ వద్దకు చేరుకుని భారీ ఎత్తున నినాదాలు చేశారు. అదే సమయంలో లోపల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. బయటకు వచ్చిన బీజేపీ కార్యకర్తలు, ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలపై దాడికి దిగారు.కర్రలతో ఇరు వర్గాలు దాడికి దిగగా.. అడ్డుకునే యత్నం చేసిన ఓ కానిస్టేబుల్‌ గాయపడ్డాడు.

Read Also: New Secretariat : కొత్త సెక్రటేరియట్‎ను పరిశీలించిన సీఎం కేసీఆర్

మరోవైపు పోలీస్‌ వాహనం సైతం ధ్వంసం కావడంతో.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కార డిమాండ్‌తో ఎమ్మార్సీఎస్‌ ఆందోళన చేపట్టింది. అయితే ఈ వ్యవహారంలో బీజేపీ వైఖరి, కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని ఎమ్మార్పీఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. ఇక గత రాత్రి ఎమ్మార్పీఎస్‌ ప్రతినిధుల బృందం ఒకటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసి ఈ మేరకు ఓ వినతి పత్రం సమర్పించాయి కూడా. అయినప్పటికీ మరుసటి నాడే ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడంతో.. దీని వెనుక ఎవరైనా ఉన్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది బీజేపీ.

Read Also: KTR: మంత్రి నోట ఆసక్తికరమైన మాట.. మోడీ దేవుడు ఎందుకయ్యాడు ?