Bonza Airline: తక్కువ ధరలో విమాన ప్రయాణికులకు సేవలందించేందుకు ఆస్ట్రేలియాలో కొత్త ఎయిర్ లైన్స్ సంస్థ అందుబాటులోకి రానుంది.దేశీయ విమానయాన సంస్థ బొంజా ఎయిర్‌లైన్ కు ఆస్ట్రేలియాలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆమోదం లభించింది. విమాన సర్వీసులను ప్రారంభించేందుకు సివిల్ ఏవియేషన్ సేఫ్టీ అథారిటీ అనుమతినిచ్చింది. ఇది క్వీన్స్‌లాండ్, అంతర్రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ విమానాశ్రయాలకు విమాన సర్వీసులను ఆందిస్తుంది. క్వీన్స్‌ల్యాండ్‌లోని సన్‌షైన్ కోస్ట్ నుండి వారాల్లోనే మొదటి సర్వీస్‌ను ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. 16 గమ్యస్థానాలకు సన్‌షైన్ కోస్ట్‌లోని బేస్ నుండి సేవలు అందించబడతాయి. వీటిలో కైర్న్స్, టౌన్స్‌విల్లే, విట్సుండే కోస్ట్, మాకే, రాక్‌హాంప్టన్, గ్లాడ్‌స్టోన్, బుండాబెర్గ్, క్వీన్స్‌ల్యాండ్‌లోని టూవూంబా వెల్‌క్యాంప్ ఉన్నాయి. అంతర్రాష్ట్ర గమ్యస్థానాలలో కాఫ్స్ హార్బర్, పోర్ట్ మాక్వేరీ, టామ్‌వర్త్, న్యూకాజిల్, ఆల్బరీ, మిల్దురా, అవలోన్, మెల్‌బోర్న్ ఉన్నాయి.
Read Also: Elon Musk: నష్టాలతో గిన్నీస్ బుక్ రికార్డ్ నెలకొల్పిన ఎలాన్ మస్క్
బోంజా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ జోర్డాన్ మాట్లాడుతూ ఫిబ్రవరిలోపు విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బోన్సా స్మార్ట్‌ఫోన్ యాప్, రిజిస్టర్డ్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా మాత్రమే టిక్కెట్‌లను విక్రయిస్తామని ఆయన తెలియజేశారు. 15 సంవత్సరాల క్రితం టైగర్ ఎయిర్‌వేస్ ప్రారంభించిన తర్వాత ఇది ఆస్ట్రేలియా యొక్క మొదటి ఎయిర్‌లైన్ అని ప్రాంతీయ అభివృద్ధి మంత్రి కేథరీన్ కింగ్ చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమానయాన రంగం ఆస్ట్రేలియాదేనని ఆమె అన్నారు. కొత్త ఎయిర్‌లైన్ ప్రవేశం దేశీయ ఛార్జీలను తగ్గించడంలో సహాయపడుతుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తోంది. బోంజాకు US-ఆధారిత పెట్టుబడి సంస్థ 777 భాగస్వాములు మద్దతునిస్తున్నారు. ప్రస్తుతం దేశీయ ఎయిర్‌లైన్ మార్కెట్‌లో నడుస్తున్న క్వాంటాస్, జెట్‌స్టార్, వర్జిన్ మరియు రెక్స్ వంటి ప్రధాన విమానయాన సంస్థలతో బోన్సా పోటీ పడనుంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, బ్రిస్బేన్ వంటి అతిపెద్ద నగరాలను తప్పించి ప్రాంతీయ ప్రాంతాలకు సేవలందించడం బోంజా లక్ష్యం. ప్రపంచంలోని టాప్ 15 దేశీయ విమానయాన మార్కెట్లలో తక్కువ ధర కలిగిన విమానయాన సంస్థ లేనిది ప్రస్తుతానికి ఆస్ట్రేలియా మాత్రమే.