Site icon NTV Telugu

Cisco Layoffs 2024: 4 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న సిస్కో..

Layooff

Layooff

ఈమధ్య ప్రముఖ ఐటి కంపెనీలు ఆర్థిక పరిస్థితుల నుంచి బయట పడేందుకు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు.. అమెరికా టెక్‌ కంపెనీలు మెటా, ట్విటర్‌, గూగుల్‌ వంటివి ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు వేల మందిని ఇంటికి పంపించింది.. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి మరో దిగ్గజ కంపెనీ వచ్చి చేరింది..

గత ఏడాది ఈ తొలగింపులు ఎక్కువ అయ్యాయి.. 2023లో దాదాపు 14,418 మందికి వివిధ సంస్థలు ఉద్వాసన పలికినట్లు ఈ నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఈ సంఖ్య 14,224గా ఉంది. 2024లో కూడా అదే తంతు కొనసాగుతుంది.. ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ 1000 మంది ఉద్యోగులును తొలిగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఈబే లేఆఫ్ ప్రకటించింది. వెయ్యి మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఇక ముందు కూడా ఉద్యోగులను భారీగా తొలగించవచ్చు అని ప్రకటించింది.. ఇప్పుడు సిస్కో కంపెనీ కూడా అదే దారిలో నడుస్తుంది..

పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా తమ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 5 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు గ్లోబల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం సిస్కో ప్రకటించింది.. సిస్కో యొక్క ఇటీవలి వార్షిక నివేదిక ప్రకారం, కంపెనీ దాదాపు 85,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది, అంటే తాజా ఉద్యోగాల కోత 4,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని CNN నివేదించింది.. ఇంకా ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తుంది..

Exit mobile version