Site icon NTV Telugu

Dinesh Phadnis Passes Away: సీఐడీ ఫేమ్ నటుడు దినేష్ ఫడ్నిస్ కన్నుమూత

New Project (7)

New Project (7)

Dinesh Phadnis Passes Away: ఇటు తెలుగు అటు హిందీ పాపులర్ క్రైమ్ షో ‘సిఐడి’లో సిఐడి అధికారి ఫ్రెడరిక్స్ పాత్రను పోషించిన దినేష్ ఫడ్నిస్ కన్నుమూశారు. కందివాలిలోని తుంగా ఆసుపత్రిలో సోమవారం అర్ధరాత్రి 12.08 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు ప్రస్తుతం 57 ఏళ్లు. దినేష్ ఫడ్నిస్ బహుళ అవయవ వైఫల్యం కారణంగా మరణించాడు. సీఐడీలో దయా పాత్రను పోషించిన దయానంద్ శెట్టి, దినేష్ ఫడ్నిస్‌కి చాలా సన్నిహిత మిత్రుడు. దినేష్ కాలేయం, గుండె, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నాడు. రోజురోజుకు అతడి ఆరోగ్యం క్షీణించడంతో దినేష్ ఫడ్నిస్ నవంబర్ 30నాడు కండివాలిలోని తుంగా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అప్పటి నుంచి వైద్యులు అతడిని వెంటిలేటర్‌పై ఉంచారు.

Read Also:Salaar: అది కూడా బయటకి వస్తే బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం జరుగుతుంది

టీవీ షోలే కాకుండా దినేష్ పలు సినిమాల్లో చేశారు. దినేష్ ఫడ్నిస్ 1998లో షో సిఐడి ప్రారంభమైనప్పటి నుండి దానిలో నటిస్తూనే ఉన్నారు. సిఐడి రెండు దశాబ్దాల ప్రయాణంలో ప్రతి ఎపిసోడ్ లో కనిపించాడు. 20 ఏళ్లుగా ఈ షోలో పనిచేసి తన పాత్రతో ప్రజల గుండెల్లో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. టీవీతో పాటు, దినేష్ ఫడ్నిస్ సినిమాల్లో కూడా పనిచేశారు. ‘సర్ఫరోష్’లో ఇన్‌స్పెక్టర్‌గా నటించాడు. ‘సూపర్ 30’ సినిమాలో కూడా కనిపించాడు. 2000లో విడుదలైన ‘మేళా’ చిత్రంలో కూడా అతని అతిధి పాత్రలో కనిపించాడు. అతను 2001లో విడుదలైన ఆఫీసర్‌లో ఇన్‌స్పెక్టర్ పాత్రలో కూడా కనిపించాడు. ఈ రోజు బోరివాలిలోని దౌలత్ నగర్ శ్మశాన వాటికలో దినేష్ ఫడ్నిస్ అంత్యక్రియలు జరుగుతాయి.

Read Also:Michaung Rain Alert: తెలంగాణపై మిచౌంగ్‌ ప్రభావం.. జిల్లా కలెక్టర్లతో రాహుల్ బొజ్జా టెలీ కాన్ఫరెన్స్

Exit mobile version