ఎమ్పీ రఘురామ కృష్ణంరాజును హైదరాబాద్ లోని అతని నివాసంలో అరెస్ట్ చేశాం అని సీఐడీ అడిషనల్ డీజీపీ తెలిపారు. కొన్ని వర్గాల పై హేట్ స్పీచెస్ చేశారని, ప్రభుత్వం పై అసంతృప్తి పెరిగే విధంగా మాట్లాడారని సమాచారం అని తెలిపిన అడిషనల్ డీజీపీ ప్రాధమిక విచారణ కు ఆదేశించారు. ఈ విచారణలో రఘురామ కృష్ణంరాజు కొంత కాలంగా వర్గాల మధ్య ఘర్షణలు పెంచేవిధంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు. ప్రభుత్వం పై ప్రజల్లో విశ్వాసం పోయే విధంగా ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తున్నారని తేలింది కొన్ని మీడియా సంస్థలతో కలిసి కుట్రపూరితంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిసింది అని పేర్కొన్నారు.