NTV Telugu Site icon

Chrysanthemum Cultivation: చామంతి సాగులో అధిక దిగుబడి పొందాలంటే ఇలా చెయ్యాల్సిందే..

Chamanthii

Chamanthii

మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్న పూల పంటలల్లో చామంతి ఒకటి.. ఈ పూలు అన్ని కార్యక్రమాల్లో వాడుతారు.. మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. అందుకే రైతులు చామంతిని ఎక్కువగా పండిస్తున్నారు.. ఈ చామంతి శీతాకాలపు పంట. ఆరుబయట పెంచే చామంతి సెప్టెంబర్‌ చివరి నుండి మార్చి మాసం వరకు లభ్యమవుతుంది. సాగులో ఉన్న చామంతి రకాలను నక్షత్ర చామంతి (చిట్టి చామంతి), పట్నం చామంతిలను పండి స్తున్నారు.. చామంతి వివిధ రకాల ఆకారాలు, రంగులలో లభ్యమవుతాయి. మన రాష్ట్రంలో ముఖ్యంగా సాగయ్యేవి తెలుపు, పసుపు మరియు ఎరుపు రకాలు.. ఒక్కో రకంలో మళ్లీ చాలా రకాలు ఉన్నాయి.. అవేంటో ఒకసారి చూద్దాం..

తెలుపు చామంతిలో రకాలు..

అర్క చంద్రిక, అర్క చంద్రకాంత్‌, పూర్ణిమ, డాలర్‌ వైట్‌, బగ్గి, రత్తాం సెలక్షన్‌, చందమామ వైట్‌, బాల్‌ వైట్‌, సుగంధ వైట్‌, పేపర్‌ వైట్‌, క్రీమ్‌ వైట్‌, రాజా వైట్‌, స్టార్‌ వైట్‌..

పసుపు చామంతిలో రకాలు..

అర్క ఎల్లో గోల్డ్‌, కో-వన్‌, రాయచూర్‌ బసంతి, పూనం, సుగంధ ఎల్లో, బాల్‌ ఎల్లో, సెంట్‌ ఎల్లో, ఎన్‌ బి ఆర్‌ ఐ ఇండియానా, గౌరీ, అర్కా స్వర్ణ..

ఎరుపు చామంతిలో రకాలు..

రెడ్‌ గోల్డ్‌, కో-2, పంజాబ్‌ గోల్డ్‌, అగ్నిశిక రకాలు అధిక దిగుబడిని పొందేందుకు వీలు పడతాయి..

నేలలు..

ఒండ్రు నేలలు మరియు ఎర్రగరపనేలలు అత్యంత అనుకూలం. నల్లరేగడి నేలల్లో తేమ ఎక్కువగా ఉన్నట్లైతే వేరుకుల్లు అధికంగా ఆశించే అవకాశం ఉంటుంది. ఉదజని సూచిక 6-7 మధ్య ఉండాలి. మురుగు నీటి పారుదల సరిగా లేనిచో మొక్కలు చనిపోతాయి… ఇక చామంతి సాగుకు అనువైన సమయం.. జూన్‌, జూలై నుండి ఆగస్టు వరకు నాటుకోవచ్చు. మార్కెట్‌ను, పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకొని ఒకేసారి నాటుకోకుండా 15-20 రోజుల వ్యవధిలో రెండు – మూడు దఫాలుగా నాటితే పూలను ఎక్కువకాలం పొందే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు..ఇవి ఎకరాకు 40,000 నుండి 45,000 మొక్కలు అవసరమవుతాయి..వాతావరణాన్ని బట్టి నేల తీరును బట్టి ఇవ్వాలి. మొదటి నెలలో వారానికి 2-3 సార్లు వారానికొక సారి నీటి తడి ఇవ్వాలి..

చామంతిలో అధిక దిగుబడిని పొందటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

చామంతి సాగుకి ఎంచుకొనేనారు ఎటువంటి చీడపీడలకు గురికాని ఆరోగ్యవంతమైన 30-40 రోజుల వయసు కలిగిన నారుని ఉపయోగించుకోవాలి. చామంతిని వేరే ఇతర పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. దీనివలన వేరు కుళ్ళు బారిన పడకుండా కాపాడుకొని అధిక దిగుబడిని పొందవచ్చు. పించింగ్‌ మరియు లేత మొగ్గలను (డిస్‌ బడ్డింగ్‌ ) వంటి యాజమాన్య పద్ధతులను సకాలంలో చేపట్టి, ముఖ్యంగా పూత సమయంలో మొక్కలను నీటి ఎద్దడికి గురికానివ్వకుండా చూసుకోవాలి. అలాగే పూత సమయంలో పూల నాణ్యత, దిగుబడిని పెంచుటకు ఎరువులను ముఖ్యంగా పొటాష్‌ ఎరువులు మరియు సూక్ష్మధాతు మిశ్రమాలను మొక్కలకు అందించాలి.. అప్పుడే దిగుబడి కూడా పెరుగుతుంది.. తెగుళ్లు కూడా ఎక్కువే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అప్పుడే మంచి లాభాలను పొందవచ్చు..