ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు చూస్తే జన్మలో అసలు వాటిని తినరు.. జనాల పైత్యానికి హద్దులేకుండా పోతుంది.. వారికున్న పిచ్చితో జనాలకు పిచ్చెక్కించేలా వింత వంటలను ట్రై చేస్తుంటారు.. కొన్ని కాంబినేషన్స్ చూస్తే ఇక అసలు ఆ ఫుడ్ ను తినాలనిపించదు.. ఇప్పుడు అలాంటిదే ఓ ఫుడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అదే చాక్లేట్ పరోటా.. దీని గురించి వింటూనే డోకు వస్తుంది కదా ఇక తింటే పరిస్థితి ఏంటో అర్ధం అవ్వడంలేదు కదా.. ఒక్కసారి ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి చూద్దాం…
‘చాక్లెట్ పరాఠా’ అనే కొత్త ఫుడ్ క్రేజ్ ఏర్పడింది, సోషల్ మీడియాలో రకరకాల కామెంట్‌లు వస్తున్నాయి. అయితే, ఈ ప్రత్యేకమైన ఫ్యూజన్ వంటకం ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.. ఈ పరోటా మసాలా బంగాళాదుంపలు లేదా పనీర్ వంటి పదార్థాలతో నిండి ఉంటుంది. అయినప్పటికీ, సంప్రదాయానికి భిన్నంగా, కొంతమంది ఆహార ప్రియులు చాక్లెట్‌తో సహా తీపి పూరకాలతో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి..
ఈ పరోటా పై కామెంట్స్ సందేహాస్పదంగానే కాదు.. పూర్తిగా నిరాకరణకు గురైంది. పరాటా యొక్క రుచికరమైన బేస్‌తో చాక్లెట్ కలయిక రుచులతో నింపడం పై పరోటా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఓ టిఫిన్ తయారీ వ్యక్తి పరోటా పిండిని తీసుకొని బాగా రుద్ది దానిలో చాక్లేట్ మిశ్రమాన్ని పెట్టి పరోటాను చేస్తారు.. దాన్ని మొత్తం నాలుగు ముక్కలుగా చేసి సర్వే చేస్తాడు.. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆలస్యం ఎందుకు ఒక లుక్ వేసుకోండి..