Site icon NTV Telugu

Chiranjeevi : ‘విశ్వంభర’ షూట్ కి బ్రేక్.. భార్యతో చిరు స్పెషల్ ట్రిప్..

Chiranjeeviii

Chiranjeeviii

సినీ స్టార్స్ వాలంటైన్స్ డే సందర్బంగా తమ భార్యలకు స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడమో.. లేదా సర్ ప్రైజ్ చెయ్యడమో చేస్తున్నారు.. మెగాస్టార్ చిరంజీవి కూడా తన భార్యతో కలిసి ఈరోజును మరింత స్పెషల్ గా జరుపుకొనేందుకు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరి ఫారిన్ ట్రిప్ కు వెళ్లాడు.. అందుకు సంబందించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ఈ సోషియో ఫాంటసీగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. అయితే తాజాగా ఈ షూట్ కి బ్రేక్ ఇచ్చి భార్యతో కలిసి ట్రిప్ కి వెళ్తున్నారు చిరంజీవి. తాజాగా చిరంజీవి విమానంలో తన భార్య సురేఖతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.. అంతేకాదు అమెరికాకు ఒక చిన్న హాలిడే ట్రిప్ వేస్తున్నాను నా భార్య సురేఖతో కలిసి. నేను తిరిగి వచ్చాక మళ్ళీ విశ్వంభర షూట్ మొదలుపెడతాను. త్వరలోనే మీ అందర్నీ కలుస్తాను. అలాగే మీకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు..

ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపికైనందుకు అమెరికాలో తెలుగువారు, మెగా ఫ్యాన్స్ నిర్వహిస్తున్న సన్మానం అందుకోడానికి వెళ్తున్నట్టు సమాచారం.. ఇటీవల ఆయనకు ఆ అవార్డు వరించిన విషయం తెలిసిందే.. ఏది ఏమైనా చిరు ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. విశ్వంభర సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..

Exit mobile version