Site icon NTV Telugu

Chiranjeevi : అసెంబ్లీలో ఆ సన్నివేశం చూసి ఆశ్చర్యపోయా..?

Whatsapp Image 2024 05 10 At 8.23.35 Am

Whatsapp Image 2024 05 10 At 8.23.35 Am

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం పద్మ అవార్డు విజేతలను ప్రకటించింది.సినీ రంగం నుంచి చిరంజీవి, వైజయంతిమాల, ప్రముఖ డ్యాన్సర్ పద్మ సుబ్రమణ్యం పద్మవిభూషణ్‌ అవార్డు కు ఎంపికయ్యారు.తాజాగా పద్మ విభూషణ్ అవార్డు కోసం మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లారు.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా పద్మ అవార్డులను మే 9 న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు.సినీ రంగానికి విశేష కృషి చేసిన చిరంజీవి, వైజయంతి మాలకు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను ప్రదానం చేశారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి .

ఇదిలా ఉంటే పద్మవిభూషణ్ అందుకున్న సందర్బంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చిరంజీవి సరదాగా మాట్లాడారు.సినీ నటుడుగా తన అభిమానులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో బ్లడ్ బ్యాంకు,ఐ బ్యాంకు ఏర్పాటు చేశాను..నేను చేసిన ఆ కార్యక్రమం ఎంతో మందికి సహాయపడింది.ఇలాంటి సాయం మరింత మందికి చేయాలనీ ఉద్దేశంతో రాజకీయాలలోకి వచ్చాను.ప్రజలకు సేవ చేయడమే ఉద్దేశంగా నేను రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికలలో గెలిచి మొదటిసారి అసెంబ్లీ లో అడుగు పెట్టాను .అయితే ఎమ్మెల్యే గా తొలిసారి అడుగుపెట్టినప్పుడు చాలా కొత్తగా అనిపించిందని చిరంజీవి తెలిపారు.అసెంబ్లీ లో నాకు ఒక పక్క మీరు ,మరోవైపు జయప్రకాశ్ నారాయణ ఉండేవారు.అయితే అసెంబ్లీ లో నాయకులూ తిట్టుకోవడం చూసి షాక్ అయ్యాను.ఆ తరువాత అదే నేతలు లాబీల్లో ఒకరి భుజంపై ఒకరు చేయి వేసుకొని మాట్లాడుకోవడం చూసి ఆశ్చర్యపోయా అని చిరు తెలిపారు.

Exit mobile version