Site icon NTV Telugu

Megastar Chiru : నంది అవార్డులపై AP ప్రభుత్వంపై చిరు కామెంట్స్.. నెటిజన్స్ ట్రోల్స్

Megastar

Megastar

హైటెక్స్ లో ఘనంగా ఏర్పాటు చేసిన “తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్” వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.  ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ‘ సినిమా వాళ్లను ప్రోత్సహించడంలో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కొంత వెనకబడి ఉంది. చంద్రబాబు నాయుడు ‘గద్దర్ అవార్డులని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ‘మన పక్క రాష్ట్రం’ ‘మరో తెలుగు రాష్ట్రం’ అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేయాలి’ అని అన్నారు. 

Also Read : GaddarFilmAwards : సినిమా వాళ్లని ఎంకరేజ్ చేయడంలో AP వెనుకబడి ఉంది – చిరంజీవి

చిరు చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ లు చెయ్యరు, ఇక్కడ పరిశ్రమ అభివృద్ధికి ముందుకు రారు, ఒక్క సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకోవడం కోసం మాత్రమే వస్తారు. గత తెలంగాణ ప్రభుత్వం పదేళ్లు ఏమి అవార్డులు ఇవ్వకుండా ఆపినపుడు కూడా చిరంజీవి ఇదే విధంగా అడిగి ఉంటే బాగుండేది. సినిమా టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగిన వెంటనే ఉత్తర్వులు ఇస్తుంది. కానీ అదే తెలంగాణలో అలాంటి పరిస్థితి ఉండదు. రాజాసాబ్ సినిమాకు చివరి నిమిషం వరకు అనుమతులు రాకపోవడంతో నెలకొన్న గందరగోళం అందరికి తెలిసందే. అలాగే చిరు తమ్ముడు పవర్ స్టార్ సినిమా ఉస్తాద్ కూడా స్పెషల్ షోస్ కు అనుమతులు ఇవ్వలేదు. అప్పుడు ఎలాంటి కామెంట్స్ చేయని సదరు హీరోలు ఇప్పుడు ఏమో ఆంధ్రప్రదేశ్  కళాకారులను ఉత్సాహాపరచడంలో వెనుకబడిందని చెప్పడం కరెక్ట్ కాదని చిరు పై విమర్శలు గుప్పిస్తున్నారు. 

Exit mobile version