Site icon NTV Telugu

Chiranjeevi: రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ మీ ప్రేమే శాశ్వతం..ఫ్యాన్స్‌కు చిరంజీవి థాంక్స్

Manashankara Varaprasad

Manashankara Varaprasad

ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ సాధించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం ఘన విజయం నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు. అత్యంత వేగంగా 300 కోట్ల మార్క్‌ను చేరిన తెలుగు చిత్రంగా మన శంకర వర ప్రసాద్ గారు ఘనత సాధించింది. ఈ చిత్రం ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్కును కూడా అధిగమించి, చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి ఇద్దరికీ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 8వ రోజు అద్భుతమైన వసూళ్లు నమోదు చేసి, భారీ బుకింగ్‌లతో 9వ రోజున మరింత జోరుని కొనసాగుస్తోంది. ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టిన ఈ చిత్రం, ఇప్పుడు మరిన్ని మైలురాళ్ల దిశగా అడుగులు వేస్తోంది.

Also Read:Nari Nari Naduma Murari: శ్రీవిష్ణు స్థానంలో నేను ఉంటే చేసేవాడిని కాదు: శర్వానంద్ షాకింగ్ కామెంట్స్!

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూ, పండుగ వాతావరణానికి మరింత ఉత్సాహాన్ని నింపుతున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ఈ విజయం వెనుక నిలిచిన ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా టీమ్‌ కు కృతజ్ఞతలు తెలిపారు. తన కెరీర్‌లోని ప్రతి మైలురాయి తరతరాల సినీ ప్రేమికుల అభిమానంతోనే రూపుదిద్దుకుందని తెలియజేశారు. “మన శంకర వర ప్రసాద్ గారు సాధించిన ఈ అద్భుతమైన విజయాన్ని చూసి నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. నేను ఎప్పుడూ మీ ప్రేమకు ప్రతిరూపమని చెబుతూనే ఉంటాను, ఈ రోజు మీరు దానిని మరోసారి నిరూపించారు.

Also Read:Phone Tapping Case : జూబ్లీహిల్స్ పీఎస్ ఎదుట ఉద్రిక్తత

ఈ రికార్డు తెలుగు ప్రేక్షకులది, డిస్ట్రిబ్యూటర్లది, దశాబ్దాలుగా నా వెంట నిలిచిన మెగా అభిమానులది. థియేటర్లలో మీ విజిల్స్‌నే నాకు ప్రాణం. రికార్డులు వస్తాయి, పోతాయి… కానీ మీ ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక్‌బస్టర్ విజయం దర్శకుడు అనిల్ రావిపుడి, నిర్మాతలు సాహు & సుష్మితతో పాటు మొత్తం టీమ్ చేసిన కృషికి నిదర్శనం. నాపై మీరు చూపించిన నమ్మకానికి ఇది అంకితం. వేడుకలు కొనసాగిద్దాం. లవ్ యూ ఆల్! ఈ సందేశంతో చిరంజీవి ఈ చిత్రం చారిత్రాత్మక విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పడమే కాకుండా, ప్రతి బ్లాక్‌బస్టర్ విజయం వెనుక ఉన్న స్ఫూర్తిని గుర్తు చేశారు. ఆయన మాటలు ఒక సత్యాన్ని బలపరుస్తున్నాయి-రికార్డులు మారవచ్చు కానీ చిరు, అభిమానుల మధ్య ప్రేమ శాశ్వతం.

Exit mobile version