Daddy Child Artist Anushka Malhotra transformation: ‘మెగాస్టార్’ చిరంజీవి హీరోగా 2001లో వచ్చిన సినిమా ‘డాడీ’. చిరు తన మాస్ ఇమేజ్‌ను పక్కన పెట్టి.. ప్రయోగాత్మకంగా చేసిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమాలో చిరంజీవికి కూతురిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ మాత్రం తన మాటలు, నటన, అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. చిరు, ఆ చిన్నారి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. ‘అక్కి, డాడీ బోత్ ఆర్ ఫ్రెండ్స్’ అంటూ ఆమె చేసిన అల్లరిని ఇప్పటికీ ఎవరూ మర్చిపోరు. అక్షయ, ఐశ్వర్యగా డాడీ సినిమాలో నటించింది. ఆ చిన్నారి పేరే ‘అనుష్క మల్హోత్రా’.
డాడీ సినిమాలో నటించే సమయానికి అనుష్క మల్హోత్రా వయసు కేవలం 4 ఏళ్లు. ఇప్పుడు ఆ బుడ్డది 29 ఏళ్ల అమ్మాయి. ముంబైలో పుట్టి పెరిగిన అనుష్క ప్రస్తుతం ఇండియాలో లేదు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హమ్‌లో కుటుంబంతో కలిసి ఉంటోంది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆమె.. లండన్‌లో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్‌గా జాబ్ చేస్తోంది. మంచి ఉద్యోగం, సాలరీతో లండన్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అప్పుడప్పుడు తన ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తుంటుంది. మొదట్లో అనుష్కను చాలా మంది గుర్తుపెట్టలేదు. విషయం తెలిసి ఓ ‘అక్షయ’నా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. ముక్కుపుడక ఆమెకు ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. ఫొటోస్ చూస్తే మీరు ఇదే అంటారు.
Also Read: Pre Wedding Shoot: ఫ్రీ వెడ్డింగ్ షూట్‌లు వద్దు.. కరపత్రం వైరల్! మీరు కూడా ఓసారి ఆలోచించండి
నిజానికి డాడీ సినిమా తర్వాత అనుష్క మల్హోత్రాకు చాలా ఆఫర్స్ వచ్చాయట. చదువు పాడవుతుందని ఆమె తల్లిదండ్రులు సినిమాలు చేయడనికి ఒప్పుకోలేదు. దీంతో అనుష్క పూర్తిగా చదువుపైనే దృష్టి పెట్టింది. బర్మింగ్‌హమ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి అనుష్కకు చాలానే ఆఫర్లు వస్తున్నాయట. ఎందుకో తెలియదు కానీ.. ఇండస్ట్రీ వైపు రావడం లేదు. అయితే సోషల్ మీడియాలో ఫొటోలు, డ్యాన్స్ వీడియోస్ పెట్టి కుర్రకారుని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అనుష్క.. హీరోయిన్ అవ్వొచ్చుగా అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
