Site icon NTV Telugu

Chiru – Bobby : చిరు – బాబీ సినిమా ఆ బ్యానర్ లోనే

Chiranjeevi

Chiranjeevi

Chiru – Bobby : మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే విశ్వంభర షూటింగ్ పూర్తి చేశారు. త్వరలోనే ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరగా సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బాబీతో మరోసారి ఓ సినిమా చేయనున్నారు. ఇద్దరూ కలిసి చేసిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో మరో సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, బాబీ ఈ సినిమా చేస్తాడని అనుకున్నప్పటికీ, ప్రొడక్షన్ హౌస్ గురించి ఇప్పటివరకు స్పష్టత లేదు.

Also Read:Allu Aravnd : శ్రీవిష్ణుకు ఇంకో రెండు సినిమాల కోసం చెక్ ఇచ్చా..

నిజానికి, బాబీ దర్శకుడిగా సూపర్ హిట్స్ అందించినప్పటికీ, అవన్నీ బడ్జెట్ విషయంలో విఫలమయ్యాయనే టాక్ సినీ పరిశ్రమలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనతో సినిమా చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్, క్వీన్స్ వృద్ధి వంటి బ్యానర్లు ముందుకు రాలేదు. బాబీ వారిని సంప్రదించినప్పటికీ, వారు సినిమా నిర్మాణంపై ఆసక్తి చూపలేదు. అయితే, ఇప్పుడు విజయ్ దేవరకొండతో జనగణమన, యశ్తో టాక్సిక్ వంటి సినిమాలు చేస్తూ, వరుసగా పెద్ద హీరోలు, దర్శకులకు అడ్వాన్స్‌లు ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమా నిర్మాణానికి ముందుకు వచ్చింది. ప్రెస్టీజ్ గ్రూప్ ఈ కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థను నిర్వహిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్‌లో పలువురు పెద్ద హీరోలు, దర్శకులకు అడ్వాన్స్‌లు ఇచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, బాబీ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
టాలీవు

Exit mobile version