తనను మెగాస్టార్ అభిమానిగా చెప్పుకునే బాబీ కొల్లి ఇప్పటికే ఆయనతో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన రెండోసారి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఆగస్టులో ప్లానింగ్‌గా ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉంది. కానీ, ఇప్పుడు డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టడం లేదని తెలుస్తోంది. స్క్రిప్ట్ విషయంలో ఇంకా మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్న బాబీ, మెగాస్టార్ చిరంజీవి సూచనలతో సినిమా షూటింగ్ డిసెంబర్ నెల నుంచి వచ్చే ఏడాది జనవరి నెలకు మార్చినట్లుగా తెలుస్తోంది.
Also Read :Prabhas : అనదర్ ఇండస్ట్రీ స్టార్ హీరోలతో ప్రభాస్ సై అంటే సై
సంక్రాంతి తర్వాత షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులను కూడా ఫైనల్ చేసే పనిలోపడ్డారు. మెగాస్టార్ చిరంజీవిని మునుపెన్నడూ చూడనటువంటి ఒక మాస్ అవతారంలో ఈ సినిమాలో చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాతోనే తెలుగులో సినీ నిర్మాతలుగా అడుగుపెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాగా నిలవనుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాని ముగించే పనిలో ఉన్నారు. ఆ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
