NTV Telugu Site icon

Megastar : విమానంలో పెళ్లి రోజు వేడుకలు.. ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

New Project 2025 02 20t154917.879

New Project 2025 02 20t154917.879

Megastar : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయనకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తను కెరీర్ ప్రారంభంలోనే పెళ్లి చేసుకుని వివాహ బంధంలో అడుగుపెట్టారు. లెజండరీ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమార్తె, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సోదరి అయిన సురేఖను ఆయన పెళ్లి చేసుకున్నారు. 1980 ఫిబ్రవరి 20న వీరిద్దరి పెళ్లి జరిగింది. 40ఏళ్లుగా అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని గడిపిన మెగా కపుల్.. నేడు తమ 45వ వివాహ వార్షికోత్సవాన్న జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ అభిమానులు, పలు నిర్మాణ సంస్థలు సోషల్ మీడియా వేదికగా చిరంజీవి, సురేఖ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read Also: PM Modi And Deputy CM Pawan Kalyan: మోడీ – పవన్‌ మధ్య ఆసక్తికర చర్చ.. ఏపీ డిప్యూటీ సీఎం ఏమన్నారంటే..?

23 న జరగనున్న ఇండియా పాకిస్థాన్ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ కు హాజరు కాబోతున్నారు చిరంజీవి. ఈ క్రమంలో వారు విమానంలో దుబాయ్ కు ప్రయాణం అయ్యారు. ఆ సమయంలో నాగార్జున కుటుంబం విమానంలో తారసపడ్డారు. పెళ్లి రోజు సందర్భంగా ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. అందులో తనకు శుభాకాంక్షలు తెలిపిన వాళ్లకు కృతజ్నతలు తెలిపారు. పోస్టులో ఆయన ఇలా రాసుకొచ్చారు…‘‘దుబాయ్ కి వెళ్ళే దారిలో కొంతమంది ప్రియ స్నేహితులతో విమానంలో మా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సురేఖలో నా కలల జీవిత భాగస్వామిని కనుగొన్నందుకు నేను ఎల్లప్పుడూ చాలా అదృష్టవంతుడినని భావిస్తున్నాను. ఆమె నా బలం, నా మార్గదర్శి.. ప్రపంచంలోని తెలియని వాటిని తెలుసుకోవడంలో ఎల్లప్పుడూ నాకు సహాయపడుతుంది. ఆమె నాకు మంచి ప్రేరణనిస్తుంది. నా ఆత్మ సహచరాలికి ధన్యవాదాలు – సురేఖ!! నీ పట్ల నా ప్రేమ, అభిమానాన్ని వ్యక్తపరచడానికి ఇలాంటి మరిన్ని సందర్భాలు రావాలి. శుభాకాంక్షలు తెలిపిన శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు!! ఆశీర్వదించండి! 🙏 ’’ అంటూ రాసుకొచ్చారు.

Read Also:TPCC Mahesh Goud : ఇదే మీ పార్టీ పరిస్థితిని అర్థమయ్యేలా చేస్తుంది.. కేసీఆర్‌పై మహేష్‌ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు

చిరంజీవి ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. వాటిలో విశ్వంభర మొదట రాబోతుంది. దీనికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే అనిల్ రావిపూడి తో కలిసి మరో చిత్రాన్ని చేస్తున్నారు.