వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక పాలనలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పాలనా వికేంద్రీకరణలో మూడు రాజధానులకు ప్రాధాన్యత ఇస్తున్న జగన్ ఇటీవల కొత్తగా జిల్లాలను ఏర్పాటుచేశారు. రెవిన్యూ మండలాలను పెంచి సామాన్యులకు రెవిన్యూ వ్యవస్థను మరింత దగ్గరగా చేర్చారు. తాజాగా జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కొత్తగా మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని నాలుగు మండలాలతో కలిపి చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ఈ రెవిన్యూ డివిజన్ లో ఏటిపాక, చింతూరు, కూనవరం, వర రామచంద్రాపురం మండలాలు వుంటాయి,. చింతూరు రెవెన్యూ మండలం ఏర్పాటుచేస్తూ ఈమేరకు ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా (Praksam District) అతి పెద్ద జిల్లాగా మారింది. ఏపీకి పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖ రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లా అయింది. చింతూరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేసిన సీఎం జగన్ కు ఆప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా వుంటే.. ఇప్పటివరకూ వివిధ జిల్లాల్లో వున్న రెవిన్యూ డివిజన్లు ఇవే
1. శ్రీకాకుళం జిల్లా : పలాస , టెక్కలి, శ్రీకాకుళం
2. విజయనగరం : బొబ్బిలి, చీపురుపల్లి (కొత్త), విజయనగరం
3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ
4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం, చింతూరు (కొత్తగా)
5. విశాఖపట్నం : భీమునిపట్నం, విశాఖపట్నం
6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం,
7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ
8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట
9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు
10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం
11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు
12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు
13. ఎన్టీఆర్: విజయవాడ, తిరువూరు, నందిగామ
14. గుంటూరు : గుంటూరు, తెనాలి
15. బాపట్ల : బాపట్ల, చీరాల
16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి
17. ప్రకాశం : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి
18. నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు
19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ
20. నంద్యాల: ఆత్మకూరు, డోన్, నంద్యాల
21. అనంతపురం: అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్
22. శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి
23. వైఎస్ఆర్ కడప: బద్వేల్, కడప, జమ్మలమడుగు
24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి
25. చిత్తూరు : చిత్తూరు, నగరి , పలమనేరు , కుప్పం
26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి), తిరుపతి