NTV Telugu Site icon

Viral News: ఏంటి తల్లి మరీ ఇంత పట్టుబడుతున్నావ్.. ఫ్లైట్‌లో బ్యాగు కిందపెట్టనంటున్న మహిళ

Bag

Bag

విమానాలు ఆలస్యం కావడం పెద్ద విషయం కాదు. కొన్నిసార్లు వాతావరణం కారణంగా విమానం టేకాఫ్‌లో ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు ప్రయాణికుడి కారణం కూడా ఉంటుంది. తాజాగా చైనాలోని ఓ విమానంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉన్న ఒక అమ్మాయి తన ఖరీదైన లూయిస్ విట్టన్ బ్యాగ్‌ని తన ముందు ఉన్న కుర్చీ కింద పెట్టడానికి నిరాకరించింది. తన ఖరీదైన బ్యాగును పక్కనే ఉన్న సీటుపై ఉంచుతానని ఆమె మొండికేసింది. ఈ విషయంపై ఫ్లైట్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చివరికి ఆ మహిళను విమానం నుండి దింపేశారు.

చైనీస్ మీడియా అవుట్‌లెట్ ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ నివేదిక ప్రకారం.. ఈ ఘటన ఆగస్ట్ 10న జరిగింది. విమానంలోని ఎకానమీ క్లాస్‌లో కూర్చొన్న ఓ మహిళా ప్రయాణికురాలిని ఫ్లైట్ అటెండెంట్ తన బ్యాగ్‌ని ముందు సీటు కింద పెట్టమని కోరారు. దానికి ఆమె నిరాకరించింది. బ్యాగ్‌ను పక్కనే ఉన్న సీటుపై పెడుతానని సిబ్బందికి చెప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తోటి ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 40 లక్షల మందికి పైగా వీక్షించారు.

Uddhav Thackeray: ‘‘ఆ ఆస్తుల్ని తాకనివ్వం’’.. వక్ఫ్ బిల్లుపై మౌనం వీడిన ఠాక్రే..

మహిళా ప్రయాణికురాలిని తన బ్యాగ్‌ని విమాన సిబ్బంది సూచించిన స్థలంలో ఉంచడానికి నిరాకరించడంతో.. ఆమెను విమానం నుండి దింపి బోర్డింగ్ గేట్ వద్దకు పంపించారు. కాగా.. ఆ మహిళను విమానం నుంచి దింపుతుండగా ఇతర ప్రయాణికులు చప్పట్లు కొట్టారు. కాగా.. చైనాలో లూయిస్ విట్టన్ బ్యాగ్ ధర US$3,000 కాగా, చైనా ఎక్స్‌ప్రెస్ ఎయిర్‌లైన్స్‌లో ఎకానమీ క్లాస్ టిక్కెట్ ధర US$110. అయితే ఆ మహిళా ప్రయాణికురాలి పేరును ఎయిర్‌లైన్స్ వెల్లడించలేదు.

ఈ ఘటనపై చైనా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మహిళా ప్రయాణికురాలికి పలువురు మద్దతు తెలుపుతుండగా.. పలువురు ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు. ఒక వినియోగదారు సోషల్ సైట్ వీబోలో తన బ్యాగ్ తన జీవితం కంటే విలువైనదని రాశారు. ఒక గంట వేస్ట్ చేసి ఫ్లైట్‌లో నుంచి దింపడం అవసరమా? ఆ మహిళ బ్యాగ్ కంటే.. ఇతర ప్రయాణికుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మరో వినియోగదారు చెప్పారు.