Hair Clump: ఎంతోమందికి ఎన్నో వింత రుగ్మతలు ఉంటాయి. కొంతమంది మట్టి తింటారు. మరికొంత మంది చాక్‌పీసులు కరకర నమిలేస్తుంటూరు. ఇలాంటి వివిధ వింత రుగ్మతల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. తాజాగా చైనాలోని షాన్స్‌కీ ప్రావిన్స్‌కు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక కూడా ఓ విచిత్రమైన రుగ్మతతో ఆస్పత్రిలో చేరింది. ఆహారం తీసుకోలేని స్థితిలో ఉన్న ఆ బాలిక అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు నిర్ఘాంతపోయారు. పొట్టనిండా వెంట్రకలు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు.
శస్త్ర చికిత్స అనంతరం పొట్ట నుంచి 3 కేజీల బరువైన వెంట్రుకలతో కూడిన బంతిని బయటకు తీశారు. ఆమె గత కొన్నేళ్లుగా ఆమె జుట్టును ఆమె నమిలి మింగింది. ఎంతలా అంటే తన పొట్టలో ఆహారానికి ఖాళీ స్థలం లేకుండా ఉంది. ఆమెకు జుట్టు లేకుండా దాదాపు బట్టతల అయిపోయింది. ఆస్పత్రిలో చేరిన బాలికకు అక్కడి వైద్యులు రెండు గంటలపాటు శస్త్ర చికిత్స చేసి ఆమె పొట్ట, ప్రేగుల్లో నుంచి 3 కిలోల బరువున్న హెయిర్ బాల్‌ను తొలగించారు. ఆ బాలిక పికా అనే రుగ్మతతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ రుగ్మత కారణంగా కొందరు కాగితం, మట్టి, ఇతర తినకూడని వస్తువులను తింటారని వైద్యులు వివరించారు.
Shots At Family Members: గేమ్‌లో తీవ్ర వాగ్వాదం.. యూఎస్‌లో కుటుంబసభ్యులపై వ్యక్తి కాల్పులు
బాలిక తల్లిదండ్రులు దూరంగా ఉండడంతో తాతయ్య, నానమ్మ దగ్గరే పెరుగుతోంది. పరిస్థితి విషమించేవరకు వారూ ఈ విషయాన్ని గుర్తించలేదని వైద్యులు తెలిపారు. కొన్నేళ్లుగా ఆ చిన్నారి ఈ రుగ్మతతో బాధపడుతోందని చెప్పారు. ఆమె చికిత్సకు బాధ్యత వహించిన జియాన్ డాక్సింగ్ ఆస్పత్రికి చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ షి హై మాట్లాడుతూ, “ఆమె తినలేక మా వద్దకు వచ్చింది. ఆమె కడుపు చాలా వెంట్రుకలతో నిండి ఉందని తెలుసుకున్నాం. కడుపులో ఆహారం కోసం స్థలం లేదు. ఆమె పేగు కూడా మూసుకుపోయింది.” అని వెల్లడించారు. ఆమె చాలా సంవత్సరాలుగా మానసిక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చన్నారు. కాబట్టి సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని ఆయన సూచించారు. సాధారణంగా జుట్టు ఆరగించే అలవాటు ఉన్న వారు ప్రాణాలు సైతం కోల్పోయిన సందర్భాలున్నాయి. 2017లో, యూకేలోని 16 ఏళ్ల విద్యార్థిని తన కడుపులో హెయిర్‌బాల్ కారణంగా ఇన్ఫెక్షన్ కారణంగా హఠాత్తుగా మరణించిందని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.
