NTV Telugu Site icon

China Birth Rate: పెళ్లికాకున్నా ఫర్వాలేదు.. పిల్లలు పుట్టడం కావాలి

World Population

World Population

China Birth Rate: ప్రస్తుతం దేశంలో తగ్గుతున్న జననాల రేటుపై చైనా ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. జననాల రేటును పెంచేందుకు అక్కడి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉండగా, ఫిబ్రవరిలో పెళ్లికాని మహిళలను సంతానం పొందేందుకు నమోదు చేసుకునే నిబంధనను చైనా ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. అంటే పెళ్లికాని చైనీస్ మహిళలు ఇప్పుడు గర్భం దాల్చిన తర్వాత వేతనంతో కూడిన సెలవులు, పిల్లల సబ్సిడీలను పొందవచ్చు. గత 60 ఏళ్లలో తొలిసారిగా చైనా జనాభా క్షీణతను ఎదుర్కొంటోంది. చైనాలో ప్రజల వయస్సు వేగంగా పెరుగుతోంది.

Read Also: Ponniyin Selvan 2: మొదటి పార్ట్ కన్నా తక్కువే… అయినా ఇండస్ట్రీ హిట్

దీని గురించి ఆందోళన చెందుతున్న దేశ ప్రభుత్వం మార్చి నెలలో ఇన్-విట్రో ఫెర్టిలిటీ (IVF)కి సంబంధించిన సేవలను సరళీకృతం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ వెసులుబాటును ఉపయోగించుకొని నైరుతి సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డులో విడాకులు తీసుకున్న 33 ఏళ్ల మహిళ ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చింది. చాలా మంది ఒంటరి మహిళలూ ఐవీఎఫ్ సెంటర్లకు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇన్-విట్రో ఫెర్టిలిటీ సహాయంతో దేశవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటును పెంచడంలో సహాయపడుతుంది. ఇది ప్రస్తుతం ఒక వ్యాపారంగా చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. ఇన్వో బయోసైన్స్ (INVO.O) వద్ద ఆసియా పసిఫిక్ వ్యాపార అభివృద్ధి డైరెక్టర్ వైవ్స్ లిప్పెన్స్ మాట్లాడుతూ, ఒంటరి మహిళలు కూడా పిల్లలు కనాలనుకుంటే చైనా IVF డిమాండ్‌ పెరుగుతుంది.

Read Also: Surya Stotra: ఈ స్తోత్రపారాయణం చేస్తే సూర్య భగవానుడు కష్టం కలుగకుండా చూసుకుంటాడు

Show comments