NTV Telugu Site icon

China Warns: జాగ్రత్తగా ఉండండి.. జపాన్‌తో స్నేహంపై ఆస్ట్రేలియాకు చైనా వార్నింగ్

China Warning

China Warning

China Warns Australia Over Japan Ties: జపాన్‌ను విశ్వసించే విషయంలో ఆస్ట్రేలియా జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రేలియాలోని చైనా రాయబారి జియావో కియాన్ అన్నారు. ప్రాంతీయ శక్తితో స్నేహం చేయడానికి ముందు రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ చేసిన యుద్ధ నేరాలను ఆస్ట్రేలియా గుర్తుంచుకోవాలని చైనా మంగళవారం పేర్కొంది. ఆస్ట్రేలియా సర్కారు డ్రాగన్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆస్ట్రేలియా జపాన్‌తో ఇటీవల కొత్త భద్రతా ఒప్పందంపై సంతకం చేసింది. ఇది పసిఫిక్ ప్రాంతంలో చైనాను కట్టడి చేసే ప్రయత్నంగా డ్రాగన్ భావించింది.

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆస్ట్రేలియాపై దాడులు చేసినందున, జపాన్‌ను విశ్వసించే విషయంలో కాన్‌బెర్రా జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రేలియాలోని చైనా రాయబారి జియావో కియాన్ అన్నారు.”రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ ఆస్ట్రేలియాపై దాడి చేసింది, డార్విన్‌పై బాంబు దాడి చేసింది, ఆస్ట్రేలియన్లను చంపింది. ఆస్ట్రేలియా యుద్ధఖైదీలను కాల్చివేసింది” అని ఆయన విలేకరులతో అన్నారు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రేలియాను హెచ్చరించారు. ఆస్ట్రేలియాలో జపాన్ రాయబారి గురించి అడిగినప్పుడు చైనా రాయబారి జియావో ఈ విధంగా విరుచుకుపడ్డారు.

Daughter Of Ex Iran President: ఇరాన్ మాజీ అధ్యక్షుడి కుమార్తెకు ఐదేళ్ల జైలు శిక్ష

2020లో వివాదం ముదిరిన సమయంలో బార్లీ, వైన్ వంటి కీలక ఆస్ట్రేలియా ఎగుమతులపై చైనా సుంకాలను విధించింది. అనధికారికంగా ఆస్ట్రేలియన్ బొగ్గు దిగుమతులను నిలిపివేసింది. ఒక సమయంలో చైనా ప్రభుత్వ మంత్రులు తమ ఆస్ట్రేలియన్ ప్రత్యర్ధుల నుంచి కాల్స్ తీసుకోవడానికి కూడా నిరాకరించారు. ఇటీవలి సంవత్సరాలలో వాణిజ్యపరగా అంతరాయం కలిగిందని జియావో అంగీకరించాడు. అయితే అది మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.