NTV Telugu Site icon

China Sheep Mystery : గుండ్రంగా తిరుగుతున్న గొర్రెలమంద.. సైంటిస్టులకే సవాల్

Sheep

Sheep

China Sheep Mystery : చిత్రాతి విచిత్రాలన్నీ చైనాలోనే జరుతాయి. మనుషులు అంతుచిక్కని వైరస్ లను కనుగొంటూ కొత్త రోగాలను సృష్టిస్తున్నారు. వీరి వల్ల ప్రపంచమంతా భయపడుతోంది. వాళ్లేనా మేమేం ఏం తక్కువ తిన్నామా అన్నట్లు తాజాగా అక్కడి జంతువులు కూడా ప్రవర్తిస్తున్నాయి. వాటి విచిత్ర ప్రవర్తనలతో శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతున్నాయి. కొన్ని పోస్టులు చూసినప్పుడు ఇలాంటివి కూడా ఉంటాయనుకోవాల్సిందే. అలాంటి ఓ వీడియోని చైనా అధికారిక వార్తా సంస్థ పీపుల్స్ డైలీ.. తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. వీడియోలో ఉన్నది గొర్రెలు మాత్రమే. కానీ వాటి ప్రవర్తనే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడదే మిస్టరీగా మారింది.

ఈ వీడియోపై అందరూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. నిజానికి ఇదో సీసీటీవీ ఫుటేజ్ వీడియో. దీన్ని నవంబర్ 16, 2022న పోస్ట్ చేయగా ఇప్పటివరకూ.. 80 లక్షల మంది వ్యూస్ వచ్చాయి. 1,323 మంది లైక్ చేశారు. ఈ వీడియోని గమనిస్తే.. ఇందులో వందకు పైగా గొర్రెలు ఉన్న చోటే గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి. అవి అలా పది రోజుల నుంచి తిరుగుతున్నాయనీ.. ఉత్తర చైనా లోని ఇన్నర్ మంగోలియాలో ఇలా జరుగుతోందని తెలిపింది. కొంతమంది ఆ గొర్రెలు ఏమీ తినట్లేదనీ.. అయినా వాటికి నీరసం రావట్లేదని అంటున్నారు. మరి అవి ఎందుకు అలా తిరుగుతున్నాయి? అనేది ఎవరికీ అర్థం కావట్లేదు.