Gujarat Tragedy: గుజరాత్‌లో మోర్బీ వంతెన దుర్ఘటన విషాదాన్ని మిగిల్చింది. ప్రపంచ దేశాలు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా మోర్బీ వంతెన కూలిన ఘటనపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సంతాపం వ్యక్తం చేశారు. పశ్చిమ భారతదేశంలోని గుజరాత్‌లో ఘోరమైన వంతెన కూలిపోవడంపై చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు సంతాప సందేశాన్ని పంపారు. చైనీస్ ప్రభుత్వం, చైనా ప్రజల తరపున, బాధితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబాలకు, గాయపడిన వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు.
Sukesh Chandrashekar: సత్యేంద్రజైన్‌కు రూ.10 కోట్లు లంచం ఇచ్చా.. ఆప్ మంత్రికి నెలకు రూ.2కోట్లు!
గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనలో 135 మంది మరణించారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు మరణించడం అందర్ని కలిచివేస్తోంది. దీపావళి సెలువులు కావడం, వారాంతం కావడంతో మచ్చు నదీ అందాలను తిలకించేందుకు వచ్చిన చాలా మంది ఈ ప్రమాదం బారిన పడ్డారు. మరమ్మతులు జరిగిన ఐదు రోజులకే బ్రిడ్జ్ కూలిపోవడంపై గుజరాత్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు కారణం అని భావిస్తున్న 9 మందిని అరెస్ట్ చేసింది. దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. కేవలం 150 లోపు మంది సామర్థ్యాన్ని కలిగి ఉన్న వంతెనపైకి ఒక్కసారిగా 500 మంది వరకు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, లోకల్ అధికారులు కలిసి చాలా వందల మందిని కాపాడారు. అయినా కూడా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే మరణించిన వారి సంఖ్య 135కి చేరుకుంది.