NTV Telugu Site icon

China : 16 ఏళ్ల క్రితం చైనాలో తలకిందులైన భూమి.. 87000 మంది మృతి

New Project (29)

New Project (29)

China : 16 ఏళ్ల క్రితం చైనాలో భయంకరమైన ప్రకృతి వైపరీత్యం నమోదైంది. 2008లో మే 12న కేవలం రెండు క్షణాలకే భూమి తలకిందులు కావడంతో చైనాలో 87 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి విపత్తులో చరిత్రలో అత్యంత భయంకరమైన భూకంపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. వేలాది మంది ప్రజలు తప్పిపోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అనేక ఇళ్ళు ధ్వంసమయ్యాయి. చాలా మంది ప్రజలు వీధుల్లోకి రావాల్సి వచ్చింది.

ఈ విపత్తులో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. పరిహారం చెల్లించడానికి సంవత్సరాలు పట్టింది. ఈ భూకంపంలో 87 వేల మంది చనిపోగా, నాలుగు లక్షల మంది గాయపడ్డారు. మే 12, 2008న, చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో 7.9 తీవ్రతతో భూకంపం నమోదైంది. దాదాపు 2 నిమిషాల పాటు భూకంపం సంభవించింది. భూకంపం కేంద్రం సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డూ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని లోతు 19 కిలోమీటర్లుగా నమోదైంది.

Read Also:‘ఛలో ఏపీ’ అంటూ.. రాజకీయ నాయకుల తలరాతలు మార్చడానికి సిద్దమైన బెంగళూరు ఆంధ్ర ఓటర్లు..

6 నెలల పాటు ప్రకంపనలు
ఈ ప్రమాదకరమైన భూకంపం దేశ రాజధాని బీజింగ్, షాంఘైకి 1,500 – 1,700 కిలోమీటర్ల దూరంలో ఉంది. బ్యాంకాక్, థాయ్‌లాండ్, వియత్నాంలోని హనోయిలో కూడా భూకంపం సంభవించింది. ఈ భయంకరమైన భూకంపం తరువాత, దేశంలో ఆర్నెళ్ల పాటు అనేక ప్రకంపనలు సంభవించాయి. భూకంపం కారణంగా సుమారు 20 వేల కొండచరియలు విరిగిపడిన కేసులు నమోదయ్యాయి. భూకంపం కారణంగా కనీసం 4.8 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. 1976లో తాంగ్‌షాన్‌ భూకంపం తర్వాత చైనాలో సంభవించిన అత్యంత ప్రమాదకరమైన భూకంపం ఇదే.

80 శాతం భవనాలు ధ్వంసం
భూకంపం సంభవించిన 72 గంటల్లోనే 4.0 నుంచి 6.1 తీవ్రతతో 64 నుంచి 104 భారీ ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం కారణంగా దాదాపు 80శాతం భవనాలు ధ్వంసమయ్యాయి. వెన్చువాన్ కౌంటీలోని యింగ్‌క్సియు నగరంలో మొత్తం 9,000 మంది జనాభాలో 2,300 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు రెస్క్యూ టీమ్ నివేదించింది. సిచువాన్‌లోని బీచువాన్ కౌంటీలో 3,000 నుండి 5,000 మంది మరణించారు. అక్కడ 10,000 మంది గాయపడ్డారు.

Read Also:Anil Ravipudi : వెంకీ మూవీ కోసం భారీ రెమ్యూనరేషన్ అందుకున్న అనిల్ రావిపూడి..?