NTV Telugu Site icon

Pig Hotel: నేను ఎప్పుడూ చూడలే.. పందులకోసం ఫైవ్‌ స్టార్‌ హోటలా?

Pig Hotel22

Pig Hotel22

Pig Hotel: పందుల కోసం ప్రత్యేకంగా ఫైవ్ స్టార్ హోటలా..? నమ్మశక్యంగా లేదు కదూ.. నిజమండి అక్కడ వాటి కోసం ఏకంగా 26అంతస్థుల పిగ్ హోటల్ నిర్మించారు. అంతేకాదు వాటికోసం ప్రత్యేకంగా ఏసీలను కూడా పెట్టారు. ఇది ఎక్కడుందో తెలుసా…? కరోనాకు పుట్టినిల్లు చైనా దేశంలోని హుబే ప్రావిన్స్ ఎజౌ నగరంలో ఉంది. ఇంత పెద్ద పిగ్ ఫామ్.. ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఈ భవనంలో మొత్తం 26 అంతస్థులు ఉన్నాయి. ఒక్కో అంతస్థులో పది వేల పందులను పెంచేందుకు వీలుగా దీని నిర్మాణం చేపట్టారు. నాలుగు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవనం ఉంది. ఇందులో.. ఆటోమేటెడ్ ఫీడింగ్ మెషీన్లు ఉంటాయి. దీనికితోడు స్మార్ట్ ఎయిర్ ఫిల్టరేషన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. అంటువ్యాధులు సోకకుండా క్రిమి సంహారక వ్యవస్థలు కూడా ఉన్నాయి. పందుల వ్యర్థాలను శుద్ధి చేసేందుకు.. బయోగ్యాస్ ఆధారిత వ్యర్థాల శుద్ధి కేంద్రాన్నీ ఏర్పాటు చేశారు. రీసైక్లింగ్ ద్వారా.. విద్యుత్ ఉత్పత్తి కూడా చేపట్టనుండటం విశేషం. మొత్తంగా.. ఈ పిగ్ హోటల్ నుంచి సంవత్సరానికి 54 వేల టన్నుల పంది మాంసం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Read Also: Woman Drink Blood : అబ్బా ఎంత ఘోరం… బాలుడిని చంపి రక్తం తాగి.. ముఖానికి పూసుకుని

Read Also: RBI: మీ దగ్గర పాత రూ.500, 1000 నోట్లు ఉన్నాయా.. మార్చుకునే అవకాశం ఉంది

ఐరోపా దేశాల్లోనూ ఇలాంటి ఫామ్స్ ఉన్నప్పటికీ.. సామూహికంగా గదుల్లో పెంచిన పంది మాంసాన్ని తినడానికి జనాలు ఆసక్తి చూపించలేదు. అందుకే.. అవి ప్రస్తుతం మూతపడ్డాయి. అందుకు భిన్నంగా చైనా భారీ పిగ్ హోటల్ నిర్మించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే.. ఈ స్థాయిలో పందులను పెంచడం గతంలో చైనాలో ఎన్నడూ లేదు. గడిచిన మూడేళ్లుగానే.. ఈ బిజినెస్ ఊహించని స్థాయిలో ఊపందుకుంది. చైనాలోని రైతులు బిలియన్ల డాలర్ల కొద్దీ డబ్బును.. ఇలాంటి పిగ్ హోటళ్లలో పెట్టుబడిగా పెడుతున్నారు. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కొట్టిన దెబ్బకు భారీగా పందులను పెంచుతున్నారు. చైనాలో పుట్టినట్టుగా చెబుతున్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా మనుషులను చంపేస్తే.. ఆఫ్రికా స్వైన్ ఫ్లూ, చైనాలోని పందులపై విరుచుకుపడింది. ఈ వైరస్ ఎంతలా దెబ్బ కొట్టిందంటే.. మాంసాహారులకు పంది మాంసమే దొరకకుండాపోయింది. డిమాండ్, సప్లైలో చాలా తేడా వచ్చేసింది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ చర్యలకు దిగింది. ఆ ఫలితంగానే.. ఇలాంటి భారీ పిగ్ హోటల్స్ చైనాలోని చాలా ప్రాంతాల్లో వెలుస్తున్నాయి.

Show comments