Covid Restrictions: తీవ్ర నిరసనల అనంతరం కొవిడ్ నియంత్రణలను సడలిస్తున్నట్లు చైనా అధికారికంగా ప్రకటించింది. పాజిటివ్ కొవిడ్ కేసులు ఇప్పుడు ఇంట్లోనే క్వారంటైన్ చేసుకోవచ్చు. చైనా బుధవారం కొవిడ్ పరిమితులను సడలిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండొచ్చని.. తప్పనిసరి పీసీఆర్ పరీక్ష అవసరాలను ఆ దేశం తగ్గించింది. నేషనల్ హెల్త్ కమిషన్ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. లక్షణాలు లేని కొవిడ్ సోకిన వ్యక్తులు.. హోమ్ ఐసోలేషన్‌కు అర్హులైన తేలికపాటి కేసులు ఇంట్లోనే క్వారంటైన్‌లోనే ఉండాలని పేర్కొంది.
Wedding: పెళ్లి పీటలపై ఆగలేకపోయిన వరుడు.. షాకిచ్చిన వధువు
చైనాలో జీరో కొవిడ్ పాలసీతో విసుగు చెందిన ఆ దేశ పౌరులు ఆంక్షల సడలింపు కోసం ఎదురుచూశారు. వారు ముందు జాగ్రత్తగా మందులు, హోమ్ టెస్ట్ కిట్‌లను కొనుగోలు చేయడానికి మొగ్గుచూపారు. కొవిడ్-19 కేసులను పూర్తిగా నిరోధించాలన్న పట్టుదలతో అనుసరిస్తున్న జీరో కొవిడ్ విధానాన్ని చైనా ప్రభుత్వం దశల వారీగా సడలిస్తూ వచ్చింది . కొత్తగా వ్యాపిస్తున్న కరోనా వేరియంట్లు బలహీనమైనవి కనుక ఆంక్షలను సడలిస్తున్నట్లు తెలిపింది. జీరో కొవిడ్ పేరుతో విధిస్తున్న సుదీర్ఘ లాక్‌డౌన్‌లను చైనీయులు తీవ్రంగా నిరసిస్తున్నారు. నవంబరు 25న లాక్‌డౌన్ వల్ల గేట్లు మూసివేసిన ఒక భవనంలో అగ్ని ప్రమాదం సంభవించి 10 మంది మరణించడంతో రాజధాని బీజింగ్, షాంఘై సహా పలు నగరాల్లో నిరసనలు పెల్లుబికాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రాజీనామా కోసం కూడా డిమాండ్లు పెరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో కొవిడ్ ఆంక్షలను సడలిస్తున్నట్లు చైనా నిర్ణయం తీసుకుంది.
