Chile Forest Fires : చిలీ అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం… 46మంది మృతి, వేలాది ఇళ్లు దగ్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chile Forest Fires : చిలీ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 46 మంది చనిపోయారు. వేలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అడవుల్లో భయంకరమైన మంటలు నిరంతరం వ్యాపిస్తున్నాయన్నారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా చిలీలో పరిస్థితి నిరంతరం దారుణంగా ఉంది.
అంతకుముందు శనివారం, చిలీ అంతర్గత మంత్రి కరోలినా తోహా మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలోని మధ్య, దక్షిణాన 92 అడవులు అగ్నికి ఆహుతయ్యాయి. శనివారం మధ్యాహ్నానికి దాదాపు 43 వేల హెక్టార్ల వరకు అడవి దగ్ధమైందని ఆయన చెప్పారు. అడవుల్లో పెరుగుతున్న మంటల దృష్ట్యా, చిలీ ప్రభుత్వం శనివారం మధ్య, దక్షిణంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
Read Also:Gold Price Today : మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?
మృతుల సంఖ్య మరింత పెరగవచ్చు – అధ్యక్షుడు
ఇక్కడ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ (104 డిగ్రీల ఫారెన్‌హీట్)కు చేరుకుందని, ఇదే భయంకరమైన అడవి మంటలకు కారణమని అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ తెలిపారు. బోరిక్ శనివారం మధ్యాహ్నం హెలికాప్టర్ ఉపయోగించి ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అడవి మంటల కారణంగా కనీసం 46 మంది మరణించారు. పరిస్థితి ఎలా ఉందో పరిశీలిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
వేలాది ఇళ్లు ధ్వంసం
చిలీ అడవుల్లో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణం. ఇది జరిగినప్పుడల్లా, డజన్ల కొద్దీ ప్రజలు మరణిస్తుంటారు. తాజా అగ్నిప్రమాదంలో వేలాది ఇళ్లు ధ్వంసమైనట్లు సమాచారం. నగరమంతా పొగతో నిండిపోయింది. అగ్ని ప్రమాదం కారణంగా వందలాది కుటుంబాలు ఇళ్లను వదిలి వెళ్లిపోయాయి. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. అయినప్పటికీ ప్రభుత్వం తరుపున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Read Also:Duddilla Sridhar Babu : ఇండస్ట్రియల్ భూముల పరిరక్షణపై ఫోకస్
At least 46 people were killed in forest fires in central Chile https://t.co/qmLRQmzQLd pic.twitter.com/sLOrGWlwYn
— Reuters (@Reuters) February 3, 2024
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!