NTV Telugu Site icon

Children’s Dance : ‘పర్దేశియా’ సాంగ్‌కి దుమ్మురేపుతున్న చిన్నారులు

Children Dance

Children Dance

ప్రస్తుత కాలంలో కొన్ని హిట్ సాంగ్స్ కి చాలా మంది రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు. రీసెంట్ గా సింగర్ కిషోర్ కుమార్ పాడిన పెప్పీ సాంగ్ పర్థేశియాకి చాలా మంది రీల్స్ చేస్తున్నారు. కానీ ఓ పాఠశాల విద్యార్థులు చేసిన డ్యాన్స్ మాత్రం ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో తొందరగా పాపులర్ కావాలంటే వెరైటీగా ఏదైన చేస్తే త్వరగా ఫేమస్ అవుతారు.. ఇలా ఫేమస్ అయ్యేందుకు చాలా మంది విభిన్న రకాల సాంగ్స్, కామెడీ, లోకల్ భాషల్లో మాట్లాడి పాపులర్ అవుతుంటారు.

Also Read : Rudrangi: ఈ టీజర్ ఏంటి ఇంత వయోలెంట్ గా ఉంది…

కానీ కొన్ని మాత్రం ఒరిజినల్ సాంగ్స్ ని మించి కొరియోగ్రఫీ చేసిన స్టెప్పులతో దుమ్ము లేపుతున్నాయి. రీసెంట్ గా ఓ పాఠశాల విద్యార్థులు కొందరు స్కూల్ యూనిఫామ్ వేసుకుని కిషోర్ కుమార్ పాడిన పర్ధేశియా పాటకు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోలో చిన్నారుల స్టెప్స్ చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. @gmgjddance అనే ఇన్ స్టా గ్రామ్ యూజర్ దీనిని షేర్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోను లక్షల వ్యూస్ తో దూసుకుపోతుంది.

Also Read : Covid-19: దేశంలో వరుసగా నాలుగో రోజు 10 వేలు దాటిన కొవిడ్ కేసులు

డ్యాన్స్ చేస్తున్న పిల్లల్లో ఎంతో కాన్ఫిడెన్స్ కనిపిస్తోందని కొందరు.. ఈ చిన్నారులకు మంచి ఫ్యూచర్ ఉందని మరి కొందరు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఫ్యామిలీతో కలిసి కామెడీ వీడియోలు చేయడం.. డ్యాన్స్ లు చేయడం.. వంటలు చేయడం కామన్ గా అయిపోయింది. ఇలా కొంతమంది విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. అలాగే ఈ పిల్లల వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ గా మారింది.