Site icon NTV Telugu

Chicken Price Hike : ఏపీలో కొండెక్కిన కోడి ధరలు.. కిలో ఎంతంటే?

Ckn

Ckn

నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. చికెన్ ధరలు భారీగా పెరిగాయి.. ఈ వార్త విన్న చికెన్ ప్రియులు చికెన్ కొనడానికి వెనకడుగు వేస్తున్నారు.. ఏపీలో ఒక్కసారిగా ధరలు పెరిగాయి.. కిలో చికెన్ ధర రూ. 300 పలుకుతుంది.. పెరిగిన ఎండలతోపాటు కోళ్ల ఉత్పత్తి తగ్గడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు అంటున్నారు. మరో పక్క బర్డ్‌ ఫ్లూతో కోళ్లు చనిపోతున్నాయి. మార్చి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు..

సామాన్యులకు పెరిగిన చికెన్ ధరలు పెనుభారంగ మారాయి.. గత నెలలో కిలో ధర రూ. 180 పలికింది.. ఇప్పుడు 300 పలకడంతో చికెన్ కొనడానికి వెనకడుగు వేస్తున్నారు.. కోడి గుడ్డు ధర కూడా ఒక్కోటి రూ.5 పైనే పలుకుతోంది. పెరిగిన ధరల దృష్ట్యా కొందరు చిల్లర వ్యాపారులు ఇదే అదనుగా.. ఒక్కో గుడ్డు రూ.8 వరకు విక్రయిస్తున్నారు. కార్తీక మాసం సమయంలో కోడి మాంసం ధరలు భారీగా పడిపోవడంతో అప్పట్లో 130 రూపాయలు పలికింది..

రాష్ట్రంలో కోళ్ల ఉత్పత్తి తగ్గి, డిమాండ్‌ పెరగడంతో వ్యాపారులు ధరలు అమాంతం పెంచేశారు. ప్రస్తుతం కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ రూ.300, స్కిన్‌తో రూ.260 వరకు అమ్ముతున్నారు. ఇక బోన్ లెస్ చికెన్ రికార్డు స్థాయిలో కిలోకు రూ.500కు పైగా అమ్ముతున్నారు.. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు దండుకుంటున్నారు.. కిలో చికెన్ ధర రూ. 500 కు అమ్ముతున్నారు.. ఇక తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి.. సమ్మర్ వరకు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు..

Exit mobile version