Chevella Incident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ (ఖానాపూర్ స్టేజీ) సమీపంలో హైదరాబాద్–బీజాపూర్ హైవేపై సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో ఘటనా స్థలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాంగ్ రూట్‌లో భారీ వేగంతో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం వల్ల ఈ పెను విషాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు బస్సు కుడివైపు భాగం నుజ్జునుజ్జు కాగా, టిప్పర్ బోల్తాపడటంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.
Rohit Sharma: తాను సాధించలేకపోయినా.. మహిళల గెలుపుతో కన్నీరు పెట్టుకున్న హిట్ మ్యాన్..!
ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న ఎమ్మెల్యే కాలే యాదయ్యను స్థానికులు అడ్డుకున్నారు. కొన్నేళ్లుగా తాము రోడ్డు మరమ్మతులు చేయాలని, వెడల్పు చేయాలని పదేపదే డిమాండ్ చేస్తున్నప్పటికీ అధికారులు గానీ.. ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోవడం లేదంటూ వారు ఎమ్మెల్యేపై ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు స్థానికులు ఎమ్మెల్యేపై దాడికి కూడా ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండటంతో.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి స్థానికులను అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు దాడి జరగకుండా చూసి, ఆయనను అక్కడి నుంచి పంపించివేశారు. రోడ్డు భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఆందోళన దృష్ట్యా ఆ ప్రాంతంలో మరింత మంది పోలీసులు మోహరించారు. ఇకపోతే చేవెళ్ల బస్సు ప్రమాదంపై సచివాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం నెంబర్లు 9912919545, 9440854433 గా అధికారులు పేర్కొన్నారు.
Chevella Tragedy: చేవెళ్ల దారుణం.. స్పందించిన సీఎం రేవంత్, కేసీఆర్..!
