Chennai Tragedy: చెన్నై దారుణం చోటు చేసుకుంది.. స్టాక్ మార్కెట్లో నష్టాలు రావడంతో మనోవేదనకు గురైన కేంద్ర ప్రభుత్వ అధికారి తన కుమారుడిని చంపి… ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నై అన్నానగర్ లోని ఓ అపార్ట్మెంట్లో నవీన్ కణ్ణన్ కుటుంబం ఉంటోంది. నవీన్ తేనాంపేటలోని కేంద్ర భద్రతా విభాగ కార్యాలయంలో సీనియర్ ఎకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య నివేదిత(35), కుమారుడు లవిన్(7) ఉన్నారు. నివేదిత దక్షిణ రైల్వే ఉద్యోగిని. వారితో పాటు నవీన్ తల్లిదండ్రులు ఉంటున్నారు. గదిలోంచి నివేదిత కేకలు వేయడంతో అత్తమామలు పరుగున వెళ్లి చూశారు. కోడలు, మనవడు గొంతు కోసిన స్థితిలో పడి ఉన్నారు. ప్రాణాలతో ఉన్న నివేదితను ఆసుపత్రికి తరలించారు. గత కొద్ది కాలంగా షేర్ మార్కెట్ లో నష్టాలు వచ్చాయి. దీంతో భార్యాభర్తలు మధ్య తరచూ గొడవలు జరిగేవి. నిన్న ఇదే విషయంలో ఇరువురు మధ్య గోడవలు జరగడంతో నవీన్ తట్టుకోలేక పోయాడు. గదిలో నిద్ర పోతున్న కుమారుడిని చంపేశాడు. తాను రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆత్మహత్య చేసుకోవడానికి వెళుతున్న క్రమంలో భార్య అడ్డుపడింది. దీంతో భార్యను సైతం గొంతు కోసి చంపాలని చూశాడు. తీవ్ర గాయాలతో బెడ్ రూంలో పడి ఉన్న నివేదితను కుటుంబీకులు గమనించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: Heavy Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఆ ఏరియాల్లో జాగ్రత్త..!
