వరంగల్ జిల్లాలోని హంటర్ రోడ్డులో కెమికల్ బాక్స్ బ్లాస్ట్ అయింది. ఎన్టీఆర్ నగర్ లో కెమికల్ బాక్స్ బ్లాస్ట్ పేలుడులో భూక్య చంద్రు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వరదలకు బోందివాగులో ఆ బాక్స్ కొట్టుకు వచ్చినట్లుగా గుర్తించారు. రోడ్డు పక్కన కాగితాలు ఏరుకునే చందు మూత తీయటంతో ప్రమాదవశాత్తు కెమికల్ బాక్స్ పేలింది. దీంతో ఈ ప్రమాదంలో గాయపడ్డ చంద్రుని ఎంజీఎం ఆసుపత్రికి స్థానికులు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నిమ్స్ కు తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Chemical box blast: వరంగల్ లోని హంటర్ రోడ్డులో కెమికల్ బాక్స్ బ్లాస్ట్

Warangal