Site icon NTV Telugu

Changure Bangaru Raja : చాంగురే బంగారు రాజా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2023 10 20 At 7.57.09 Am

Whatsapp Image 2023 10 20 At 7.57.09 Am

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరావు.ఈ సినిమా నేడు గ్రాండ్ గా రిలీజ్ అయి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. టైగర్ నాగేశ్వరావు పాత్రలో రవితేజ జీవించాడని చెప్పొచ్చు.పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయిన ఈ సినిమాకు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం వుంది. వరుస సక్సెస్ లతో రవితేజ దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే రవితేజ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా రానించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా రవితేజ నిర్మించిన చిన్న సినిమా ఛాంగురే బంగారు రాజా ఈ వారమే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 27 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.క్రైమ్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో కేరాఫ్ కంచెరపాలెం ఫేమ్ కార్తిక్ రత్నం హీరోగా నటించాడు.

గోల్డి నిస్సీ, సత్య మరియు రవిబాబు కీలక పాత్రలు పోషించారు. సతీష్‌ వర్మ దర్శకత్వం వహించాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో కూడిన చిన్న సినిమాల్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో. ఆర్‌టీ టీమ్ వర్క్స్ అనే బ్యానర్‌ను రవితేజ ఈ సినిమాను ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై శ్వేత కర్లపూడితో కలిసి రవితేజ ఛాంగురే బంగారు రాజా సినిమాను నిర్మించాడు. సెప్టెంబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది.రంగురాళ్ల బ్యాక్‌డ్రాప్‌లో మర్డర్ మిస్టరీ కథాంశంతో దర్శకుడు సతీష్ వర్మ ఛాంగురే బంగారు రాజా సినిమాను తెరకెక్కించాడు.. ఇందులో బంగార్రాజు అనే బైక్ మెకానిక్ పాత్రలో కార్తిక్ రత్నం నటించాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే అనుకోకుండా బంగార్రాజు ఓ హత్యా నేరంలో చిక్కుకుంటాడు. కానిస్టేబుల్ మంగరత్నం(గోల్డి నిస్సీ) సహాయంతో బంగార్రాజు ఆ హత్యా నేరం నుంచి ఎలా బయటపడ్డాడు.. అస్సలు ఈ హత్య అతడే చేశాడా..లేదా..అనేదే ఈ సినిమా కథ.రవితేజ ఈ సినిమాతో పాటు వైవా హర్ష ప్రధాన పాత్రలో నటించిన సుందరం మాస్టారు సినిమాను కూడా నిర్మించారు…

Exit mobile version