Binance Founder Success Story: ఈ రోజుల్లో మనుషులు వాళ్ల మాటలను మార్చడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. అచ్చంగా ఒకరి జీవితంలో కూడా ఇదే జరిగింది. ఆ మనుషుల మాటలు పట్టించుకుంటే ఆయన గురించి ఈ రోజు మనం చర్చించుకునే వాళ్లం కాదు. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి. ఒకప్పుడు పిచ్చోడనోల్లే.. నేడు కోటీశ్వరుడని కొనియాడే స్థాయికి ఎలా ఎదిగారు. ఇంతకీ ఆయన సక్సెస్ స్టోరీ ఏంటి?
READ ALSO: Bhopal Student’s Death: దారుణం.. కానిస్టేబుళ్ల దాడిలో విద్యార్థి మృతి..
2014లో మొదలైన స్టోరీ..
అది 2014.. ప్రపంచం బిట్‌కాయిన్‌ను ఒక జోక్‌గా భావించిన ఆరోజుల్లో ఒక వ్యక్తి తన జీవితాన్ని దానిపై పణంగా పెట్టారు. ఆయన ఆ రోజు చేసిన పని నేడు అతన్ని బిలియన్ డాలర్ల సంపదకు అధిపతిగా మార్చింది. ఈ కథ ఎవరిది అనుకుంటున్నారు.. బినాన్స్ వ్యవస్థాపకుడు, క్రిప్టో కింగ్‌గా గుర్తింపు సంపాదించుకున్న చాంగ్‌పెంగ్ జావో (CZ) కథ. 2014లో ఆయన దాదాపు $900,000 విలువైన బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేయడానికి షాంఘైలోని తన అపార్ట్‌మెంట్‌ను విక్రయించారు. ఆ సమయంలో ఒక బిట్‌కాయిన్ విలువ కేవలం $600. బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆయన తన అపార్ట్‌మెంట్‌ను విక్రయిస్తున్నట్లు తెలిసిన తన కుటుంబం, స్నేహితులు తనను “పిచ్చోడు” అని పిలిచారు. తన తల్లి కూడా ఆయన నిర్ణయాన్ని తప్పు పట్టింది. కానీ చేసే పని మీద ఆయనకు ఉన్న నమ్మకం, దూరదృష్టి తనను విజయతీరాలకు చేర్చాయి.
ఆర్థిక మాంద్యంలో చలించలేదు..
చాంగ్‌పెంగ్ జావో బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేసిన కొన్ని నెలల తర్వాత దాని ధర $600 నుంచి $200కి పడిపోయింది. ఆ సమయంలో ఆయన సంపదలో మూడింట రెండు వంతులు తుడిచిపెట్టుకుపోయాయి. అలాంటప్పుడు మరెవరైనా వాటిని వదులుకోడానికి చూస్తారు. కానీ జావో మాత్రం వాటిని వదులుకోలేదు. దానికి బదులుగా ఆయన Blockchain.info, OKCoin వంటి కంపెనీలలో పనిచేశారు. క్రిప్టో వ్యవస్థ ప్రాథమికాలను నేర్చుకున్నారు. ఆయన బిట్‌కాయిన్‌ను మాత్రమే కొనుగోలు చేయలేదు, దాని భవిష్యత్తును నిర్మించడంలో దోహదపడ్డారు.
బైనాన్స్‌తో క్రిప్టో కింగ్..
2017లో ఆయన బైనాన్స్ సంస్థను ప్రారంభించారు. ఇది క్రిప్టో ట్రేడింగ్‌ను సులభతరం, వేగవంతమైన, నమ్మదగినదిగా చేసిన ఎక్స్ఛేంజ్. కేవలం ఆరు నెలల్లోనే బైనాన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్‌గా మారింది. ఆయన 2014లో పెట్టిన పెట్టుబడి ఇప్పుడు దాదాపు $190 మిలియన్లు (₹1,580 కోట్లు) ఉంది. బిట్‌కాయిన్ ధర $125,000 దాటింది. ఆయన తన కృషితో క్రిప్టో మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ మార్కెట్‌లో ఆయనను “క్రిప్టో కింగ్” అభివర్ణిస్తారు. అవగాహన, సహనం కలిసి ఉంటే పెద్ద రిస్క్‌లు తీసుకోవడం ఫలితాన్ని ఇస్తుందని ఆయన కథ నిరూపిస్తుంది. ఆయన బిట్‌కాయిన్‌ను పెట్టుబడిగా మాత్రమే కాకుండా, ఆర్థిక విప్లవంగా చూశారు. ఎంత మంది ఎన్ని చెప్పిన తన నమ్మకాన్ని, దూరదృష్టిని చెక్కుచెదరకుండా ఉంచుకోగలిగారు. ఒకప్పుడు పిచ్చోళ్లు అన్న నోళ్లు ఇప్పుడు ఆయనను కోటీశ్వరుడు అని కొనియాడుతున్నాయి.
READ ALSO: AC Health Risks: ఏసీలతో మృత్యుఘంటికలు.. నిపుణులు ఏం చెబుతున్నారు!
