NTV Telugu Site icon

Fastag New Rules: ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల్లో మార్పులు..ఆ తప్పులు చేస్తే బ్లాక్‌లిస్ట్!

Fastag

Fastag

ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల్లో మార్పులు సంభవించాయి. ఆగస్టు మొదటి తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీని కోసం ప్రజలు తమ ఫాస్టాగ్ ఖాతాలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారికి టోల్ ప్లాజా వద్ద కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే మీ ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ అవుతుంది. కాబట్టి ఈ విషయాల్లో మీరు కచ్చితంగా జాగ్రత్తలు వహించాలి.

READ MORE: Srivani Trust: శ్రీవాణి ట్రస్ట్‌పై టీటీడీ నిర్ణయం అదేనా..?

ఫాస్టాగ్‌కి రూల్స్‌లో వచ్చిన అతిపెద్ద ఛేంజ్ ఏంటంటే.. మీరు కేవైసీ ప్రాసెస్‌ను అప్‌డేట్ చేయాలి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్త నిబంధన ప్రకారం ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నుంచి వాడుతున్న ఫాస్టాగ్ ఖాతాలను తప్పకుండా మార్చాల్సి ఉంటుంది. దీని కోసం ఫాస్టాగ్ యూజర్లు తన ఖాతా ఇన్సూరెన్స్ తేదీని చెక్ చేసుకోవడం తప్పని సరి. అవసరమైతే దాన్ని మార్చుకోవాలి. ఫాస్టాగ్ తీసుకుని మూడు సంవత్సరాల అయితే వెంటనే కేవైసీని మళ్లీ అప్‌డేట్ చేయాలి. ఫాస్టాగ్ సేవ కోసం కేవైసీ పూర్తి చేయడానికి గడువు అక్టోబర్ 31వ తేదీ వరకు ఉంది. యూజర్లు, కంపెనీలు తమ ఫాస్టాగ్ ఖాతా కేవైసీ అప్‌డేషన్ ప్రక్రియను అక్టోబర్ 31వ తేదీ నాటికి పూర్తి చేయవచ్చు. అయితే మీ ఫాస్టాగ్ ఖాతా కేవైసీ ప్రక్రియ ఆగస్టు 1వ తేదీ నాటికి ఒక్కసారి కూడా పూర్తి కాకపోతే అది వెంటనే బ్లాక్ లిస్ట్ అవుతుందని కొత్త నిబంధనలు తెలిపాయి.

READ MORE:Yadadri Bhuvanagiri: బీర్లతో వెళ్తున్న లారీ బోల్తా.. ఎగబడ్డ మందుబాబులు..

మీ ఫాస్టాగ్ ఖాతా మీ వాహనం, వాహన యజమాని ఫోన్ నంబర్‌కు లింక్ చేయడం తప్పనిసరి. ఏప్రిల్ నుంచి ఒక్క వాహనానికి మాత్రమే ఫాస్టాగ్ ఖాతాను వినియోగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీనితో పాటు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌కు ఖాతాను లింక్ చేయడం కూడా అవసరం. ఇందుకోసం వాహనం ముందు, పక్క ఫొటోలను కూడా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 1న లేదా ఆ తర్వాత కొత్త వాహనం కొనుగోలు చేసే వారు వాహనం కొనుగోలు చేసిన మూడు నెలల్లోగా తమ రిజిస్ట్రేషన్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.

C

Show comments