హార్రర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన రాఘవ లారెన్స్ నటిస్తున్న లేటెస్ట్ హార్రర్ మూవీ చంద్రముఖి 2.. దాదాపు 18 ఏళ్ల క్రితం విడుదల అయి సూపర్ హిట్ గా నిలిచిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది..రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది. అయితే ఈ ట్రైలర్ కు కాస్త మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ చంద్రముఖి వంటి భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు పి.వాసుపై ప్రేక్షకులు మంచి హోప్స్ పెట్టుకున్నారు.ఈ సినిమాలో హీరోగా లారెన్స్ నటిస్తుండడంతో ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది.ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.
ఈ క్రమంలో టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేశారు మేకర్స్.ఇప్పటికే చెన్నైలో చేసిన వేడుకకు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది.. దాంతో తెలుగులో కూడా అదే స్థాయిలో ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నారటా మేకర్స్.. దానికోసం ఫిలిం నగర్‌లోని జే.ఆర్.సీ కన్వెషన్ హాల్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.. సెప్టెంబర్ 11 తేదిన గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుక జరుగనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి ఓ స్టార్ డైరెక్టర్ గెస్ట్‌గా రానున్నాడని తెలుస్తుంది.. అయితే ఆ డైరెక్టర్ ఎవరు అన్నది ఇంకా క్లారిటీ లేదు..వినాయక చవితి సందర్బంగా చంద్రముఖి 2 విడుదల అవుతుంది.ఈ సినిమాలో కంగానా రనౌత్ చంద్రముఖి పాత్ర పోషించింది. అలాగే ఈ సినిమాకు ఆస్కార్ గ్రహిత ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.చంద్రముఖి సినిమా తో పాటు మరో తమిళ సినిమా కూడా రిలీజవుతుంది.ఆ సినిమానే విశాల్ నటించిన మార్క్ ఆంటోని. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేసింది. తెలుగులో కూడా పెద్ద ఎత్తులోనే రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు.అయితే ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్స్ కావడంతో రెండిటి పై భారీగా అంచనాలు వున్నాయి.