స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై జైలు సూపరింటెండెంట్ రాహుల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. చంద్రబాబుకు 8 రకాల వైద్య పరీక్షలు చేసినట్లు జైలు అధికారులు వెల్లడించారు. అయితే, చంద్రబాబు బరువును హెల్త్ బులిటెన్ లో అధికారులు తెలపలేదు. ఇక, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు పరీక్షించి జైలు అధికారులకు నివేదిక సమర్పించారు. చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యాధికారులు చెప్పారు.
Health