NTV Telugu Site icon

Chandoo Mondeti : ఆ బ్యానర్ నుంచి భారీ ఆఫర్ అందుకున్న చందు మొండేటి..?

Whatsapp Image 2023 06 12 At 7.42.12 Am

Whatsapp Image 2023 06 12 At 7.42.12 Am

వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో చందు మొండేటి కూడా ఒకరు.ఈ డైరెక్టర్ కు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ కూడా ఉంది. రీసెంట్ గా కార్తికేయ 2 సినిమాతో భారీ హిట్ కొట్టాడు.గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ దర్శకుని తర్వాత సినిమాలు తెరకెక్కనున్నాయని సమాచారం.. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి ఈ దర్శకుని కి భారీ ఆఫర్ కూడా వచ్చిందని సమాచారం అందుతోంది. మూడు సినిమాలకు ఏకంగా 30 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని సమాచారం.చందు మొండేటి హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా మూడు సినిమాలకు పని చేసే అవకాశం అయితే దక్కింది. ఈ విషయంలో చందు మొండేటి భారీ ఆఫర్ దక్కిందనే అనే చెప్పాలి. కార్తికేయ2 సక్సెస్ తో ఈ దర్శకుని దశ తిరిగిందని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.. గీతా ఆర్ట్స్ నిర్మాతలు సినిమా నిర్మాణం విషయం లో కూడా ఏ మాత్రం రాజీ పడరనే విషయం తెలిసిందే.

నాగచైతన్య చందు మొండేటి కాంబో లో ఒక సినిమా అలాగే సూర్య చందు కాంబోలో మరో సినిమా తెరకెక్కనుండగా బాలీవుడ్ హీరో తో చందు మొండేటి డైరెక్షన్ లో ఒక సినిమా కూడా తెరకెక్కనుంది. ఈ మూడు ప్రాజెక్ట్ లపై భారీ గా అంచనాలు నెలకొన్నాయి. ఈ మూడు సినిమాలు కనుక సక్సెస్ సాధిస్తే చందు మొండేటి రేంజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. చందు మొండేటి కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఇతర భాషల ప్రేక్షకులు ఈ దర్శకుని డైరెక్షన్ లో పని చేయడానికి ఎంతో ఆసక్తి ని చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో చందూ మొండేటి పాన్ ఇండియా డైరెక్టర్ గా సత్తా చాటాలని కూడా ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నట్లు సమాచారం..

Show comments