Site icon NTV Telugu

ఉచిత చక్రసిద్ధ వైద్య శిబిరం ప్రారంభం..

Chakra Siddi

Chakra Siddi

ఎటువంటి మందులు లేకుండా పలు రకాల అనారోగ్య సమస్యలను తీర్చేందుకు చక్రసిద్ధ వైద్య నిపుణులు డాక్టర్ సత్య సింధుజ గారి నేతృత్వంలో వైద్యం అందించేందుకుగాను నైపుణ్యం కలిగిన ప్రత్యేక డాక్టర్లు మరియు సిబ్బంది బృందం గుండెపుడి గ్రామంలో ఉచితంగా ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఈనెల 14వ తేదీ నుండి నిర్వహిస్తున్నారు. పలు రకాల అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఈ వైద్య శిబిరానికి వచ్చి తమకున్న సమస్యలను వైద్యులకు తెలియపరచి ఉచిత వైద్యాన్ని పొందుతున్నారు. వేలల్లో లక్షల్లో రూపాయలు ఖర్చుపెట్టిన తగ్గని తమ ఆరోగ్య సమస్యలు ఈ చక్రసిద్ధ వైద్యం వల్ల తగ్గుతున్నాయని వైద్యం తీసుకున్న అనంతరం రోగులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వైద్యంలో ఎలాంటి మందులు లేకుండా, ఆపరేషన్లు చేయకుండా వైద్యులు తమకు వైద్యాన్ని అందిస్తున్నారని ఈ వైద్యం పొంది తమకు ఎంతో ఉపశమనం కలుగుతుందని రోగులు తెలుపుతున్నారు. ఇలాంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్న డాక్టర్ సత్య సింధుజ గారికి అదేవిధంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించిన కాళ్ళురు కుటుంబీకులను గ్రామస్తులు మండల ప్రజలు అభినందిస్తున్నారు.

Exit mobile version