మొబైల్ ఛార్జర్ల విషయంలో పౌరులకు కేంద్రం కీలక సూచనలు చేసింది. భారతదేశంలో USB ఛార్జర్ స్కామ్ ప్రబలంగా ఉందని కేంద్రం హెచ్చిరించింది. విమానాశ్రయాలు, కేఫ్‌లు, హోటళ్లు, బస్టాండ్‌లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జింగ్ పోర్టల్‌లను ఉపయోగించవద్దని కేంద్రం సూచించింది.
బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్స్ సాయంతో మొబైల్ ఛార్జ్ చేయొద్దని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై ఇలా బహిరంగ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జింగ్ చేయొద్దని ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. లేకపోతే సైబర్ దాడులు ఎదుర్కోవాల్సి రావొచ్చని వార్నింగ్ ఇచ్చింది.
బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన యూఎస్‌బీ ఛార్జింగ్ స్టేషన్‌లను ఆసరాగా చేసుకొని కేటుగాళ్లు సైబర్ దాడులకు పాల్పడుతున్నారని తెలిపింది. వినియోగదారుల వ్యక్తిగత డేటాను దొంగిలించడం లేదా వారి పరికరాల్లో మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడం కోసం ఛార్జింగ్ పోర్ట్స్ ఉపయోగించుకుంటున్నారని పేర్కొంది. సైబర్ దాడుల బారిన పడకుండా ఉండాలంటే.. ఇకపై బయటకు వెళ్లినప్పుడు మొబైల్‌కి ఛార్జింగ్ పెట్టాలంటే ఒకటికి, రెండుసార్లు ఆలోచించాలని విజ్ఞప్తి చేసింది.
