Site icon NTV Telugu

Godavari Pushkaralu: 2027లో గోదావరి పుష్కరాలు.. రాజమండ్రికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు..

Godavari Pushkaralu

Godavari Pushkaralu

2027లో జరిగే పుష్కరాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం 271 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఏడాదికి ఈ స్టేషన్ నుంచి గంటకు 9,533 మంది రాకపోకలు సాగిస్తారన్న అంచనాలతో స్టేషన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి కింద రూ.250 కోట్ల పనులు చేపట్టేలా టెండర్లు పిలిచింది. కాగా.. పుష్కరాల ప్రతిపాదనలతో వీటిని రద్దు చేసి కొత్త నిధులను కేంద్రం మంజూరు చేసింది.

READ MORE: Uttam Kumar Reddy : అద్భుతాలు చేస్తున్నట్లు కేసీఆర్, హరీష్ నటించారు.

కాగా.. విజయవావడ రైల్వే డివిజన్ పరిధిలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అత్యంత ప్రధానమైంది. ఈ స్టేషన్ నుంచి నిత్యం వేల మంది ప్రయాణికులు విజయవాడ-విశాఖ-కాకినాడ-భీమవరం వైపు రాకపోకలు సాగిస్తుంటారు. వచ్చే 40 ఏళ్ల నాటికి సుమారు లక్ష మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి గమ్య స్థానాలకు చేరుకుంటారని అంచనా. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రాజమండ్రి రైల్వే స్టేషన్​ను ప్రపంచ స్థాయి హంగులతో తీర్చిదిద్దాలని గతంలో రైల్వే శాఖ నిర్ణయించింది. అమృత భారత్ స్టేషన్ పథకం కింద 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది. పుష్కరాల నేపథ్యంలో కొత్త నిధులను కేంద్ర ప్రకటించింది.

READ MORE: Health Tips: రోజూ వాకింగ్ చేస్తున్నా బరువు తగ్గట్లేదా? మీరు చేసే తప్పులివే!

Exit mobile version