NTV Telugu Site icon

Govt Jobs 2024 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే?

Jobbss

Jobbss

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 7832 పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ పోస్టులకు అర్హులు ఎవరు, చివరి తేదీ, జీతం గురించి తెలుసుకుందాం..

ఈ నోటిఫికేషన్‌ ద్వారా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్‌ చదివినవారికి జూనియర్‌ ఇంజినీర్ ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి తాజాగా ప్రకటన విడుదల చేసింది.. మొత్తం 968 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు..

నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితిలో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1377 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.. అధికార వెబ్ సైట్ లో నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోవాలి..

అలాగే రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ విభాగాల్లో మొత్తం 4,660 ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు మే 14 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు..

ఇకపోతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 827 మెడికల్ ఆఫీసర్/ జీడీఎంవో ఉద్యోగాల భర్తీకి సంబందించిన ప్రకటన ఇచ్చారు.. ఈ పోస్టులన్నీ ఈ నెల నుంచి మే వరకు దరఖాస్తులను చేసుకోవచ్చు.. ఒక్కో పోస్టులకు ఒక్కో జీతం, అర్హతలు ఉన్నాయి.. అధికార వెబ్ సైట్ లను బాగా పరిశీలించి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోగలరు..