Ration Card New Rules: రేషన్ కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను విడుదల చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. రేషన్ కార్డ్ షాపుల్లో అక్రమాలను నివారించేందుకు కొత్త పరికరం ప్రవేశ పెట్టనుంది. దీని వల్ల రేషన్ కార్డ్ హోల్డర్లు పెద్ద ప్రయోజనం పొందుతారు. ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. రేషన్ దుకాణాల వద్ద ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ పరికరాలను తప్పనిసరి చేశారు.
Read Also: Tattoo : టాటూ ఎంత పని చేసింది.. భవిష్యత్ ఐపీఎస్ ప్రాణం తీసింది
రేషన్ కేంద్రాల్లో ఐపీఓఎస్(IPOS) యంత్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది లేకుండా రేషన్ పంపిణీ చేసేందుకు వీలు లేదని కేంద్రం సృష్టం చేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం లబ్ధిదారులు పూర్తి స్థాయిలో ఆహార ధాన్యాలను పొందేందుకు వీలుగా రేషన్ షాపుల్లో ఎలక్ట్రానిక్ స్కేల్స్‌తో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈపీఓఎస్) పరికరాలను అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చట్టం నిబంధనలను సవరించింది.
Read Also: PPF Scheme: నెలకు రూ.5వేలు పెడితే రూ.42లక్షలు పొందే గోల్డెన్ ఛాన్స్
జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం(NFSA) కింద టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (TPDS) పారదర్శకతను మెరుగుపరచడానికి అంటే ఆహార ధాన్యాల తూకాల్లో జరుగుతున్న మోసాలను నివారించేందుకు ఆ నిబంధన తెచ్చింది. NFSA కింద దేశంలోని దాదాపు 80 కోట్ల మందికి ఒక్కో వ్యక్తికి నెలకు ఐదు కిలోల గోధుమలు, బియ్యాన్ని వరుసగా కిలోకు రూ.2-3 చొప్పున సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తోంది. 2023లో కూడా ఉచిత రేషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కోట్లాది మందికి ప్రభుత్వం నుంచి ఉచిత రేషన్ సౌకర్యం లభిస్తోంది. అదే సమయంలో, బిపిఎల్ కార్డు హోల్డర్లకు డిసెంబర్ 2023 వరకు ఉచిత రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది.