NTV Telugu Site icon

Celebrity Cricket League: ‘ఫోర్’ ఇవ్వలేదంటూ నటి కన్నీటిపర్యంతం… వీడియో వైరల్

Cricket

Cricket

సెలబ్రెటీ క్రికెట్ లీగ్ అంటే తమ అభిమాన నటీనటులు ఆడతారంటూ ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు జనాలు. ఫన్నీగా తీసుకోవాల్సిన గేమ్ ను చాలా సీరియస్ గా తీసుకున్నారు స్టార్స్. దీంతో మొదలు కాకముందే గ్రూప్ దశలోనే టోర్నీని రద్దు చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో ఇలా జరిగి అర్థాంతరంగా ఆగిపోయింది. నిర్మాత ముస్తాఫా కమాల్ రాజ్, దీపాంకర్ దీపోన్‌కు చెందిన టీమ్స్ మధ్య బౌండరీ విషయంలో వివాదం చెలరేగింది. అంపైర్ బౌండరీని తాకినా ఫోర్ ఇవ్వాలేదంటూ మొదలైన గొడవ ఈ జట్లు కొట్టుకునే వరకు వెళ్లింది. ఎంత పెద్ద గొడవ జరిగింది అంటే ఏదో రెండు ముఠాలు కొట్టుకున్నట్లు రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో ఆరుగురు గాయపడగా వారిని ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. ఇక దీనిపై నటి రాజ్ రిపా ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Viral Fever: వైరల్ ఫివర్స్ తో వణుకుతున్న ములుగు ఏజెన్సీ.. ఏ పల్లె చూసిన జ్వర పీడుతులే..

నటి రాజ్ రిపా మాట్లాడుతూ టోర్నమెంట్ నిర్వాహకులు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారంటూ ఆరోపించింది.  బ్యాట్స్‌మెన్ ఫోర్ కొట్టినా అంపైర్ బౌండరీ ఇవ్వలేదంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ ఘటనపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్‌ను డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్‌గా మార్చేశారంటూ సెటైర్లు వేస్తున్నారు. స్నేహపూర్వక మ్యాచ్‌లో క్రీడాకారుల మధ్య ఇంతటి ఆగ్రహావేశాలా? ఫన్నీగా తీసుకోవాల్సిన గేమ్ లో ఇంత సీరియస్ గా ఉంటారా అంటూ మరికొందరు ఆశ్చర్యపోయారు.